ఓ రేంజ్ లో అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్..!

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయన నటించిన బ్లాక్ బస్టర్స్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా తదితర సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉంటుంది. సమరసింహా రెడ్డి సినిమాలో ముందు వంట వాడి పాత్రల్లో కనిపించే బాలకృష్ణ ఇంటర్వెల్ కు ముందు ఆయన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గురించి తెలుస్తుంది. అలాగే నరసింహ నాయుడు సినిమాలో డాన్స్ మాస్టర్ గా కనిపించే బాలకృష్ణ గతమెంటో ఇంటర్వెల్ సమయంలో తెలుస్తుంది. ఆ రెండు సినిమాలు రికార్డు హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శీను తో హ్యాట్రిక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అఖండ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ హిట్ సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉన్నట్లే ఈ సినిమాలో కూడా ఉందని సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి ఆఘోరా పాత్ర. ముందు వరకు సాధారణంగా కనిపించే ఓ పాత్రలో బాలకృష్ణ కనిపిస్తారట. ఇంటర్వెల్ బ్యాంగ్ లో అఘోర పాత్ర ఎంట్రీ ఉంటుందట. ఆ పాత్ర ఎంట్రీ సమయంలో బాలయ్య ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ రావడం ఖాయమని అంటున్నారు.

ఈ సినిమాలో జగపతిబాబు కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆయన కూడా అఘోరాగానే కనిపిస్తారని సమాచారం. బాలయ్యకు మార్గ దర్శకంగా ఉండే ఒక పాజిటివ్ పాత్రలో జగపతిబాబు ఇంటర్వెల్ ముందు ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. టీజర్ లో చూపించిన డైలాగ్ తో ఇంటర్వెల్ కార్డు పడుతుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. వినాయక చవితి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Also Read

‘మా’ లో ముసలం.. కృష్ణంరాజుకు ఈసీల లేఖ కలకలం

స్పెషల్​ సాంగ్​కోసం సన్నీ లియోన్​ రెమ్యునరేషన్​ ఎంతంటే?

రెండో పెళ్ళికి సిద్ధమైన సుమంత్.. వధువు ఎవరంటే..!

Related Articles

Most Populer

Recent Posts