Friday, April 19, 2024
- Advertisement -

టాలీవుడ్ హీరోల గురించి బయటపెట్టిన పూనమ్.. ఎవరు ఎలాంటి వారంటే ?

- Advertisement -

చాలా కాలం తర్వాత నాతిచరామి సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తోంది నటి పూనమ్ కౌర్. నటనతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న పునమ్..ఈ చిత్రంతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ గా నాతిచరామి తెరకెక్కుతోంది. ఈ నెల 10న ఓటీటీ వేదికగా ఈ చిత్రం విడుదల అయింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా పూనమ్కౌర్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

టాలీవుడ్ హీరోల గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది. చిన్నతనంలోనే తనకు సినీ రంగం నుంచి అవకాశాలు వచ్చినా.. కుటుంబ సభ్యులకు ఇష్టం లేక వాటిని వదిలేసుకున్నానని తెలిపింది. అనుకోకుండా తాను సినిమాల్లోకి వచ్చినట్లు గుర్తు చేసుకుంది. చేసిన కొన్ని చిత్రాలతో తనకు మంచి పేరొచ్చిందని పూనమ్ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాలకు దూరం అవుదాం అని అనుకున్నాననీ.. అయితే తన ఫ్రెండ్స్ ‘నాతిచరామి’ కథతో తన దగ్గరకు వచ్చారని చెప్పుకుంది. పట్టుబట్టి తాను ఈ సినిమాల్లో నటించేలా చేశారని గుర్తు చేసుకుంది.

ఇక టాలీవుడ్ హీరోల గురించి తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది. ‘‘నాగార్జున.. చాలా అందంగా, ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారని చెప్పింది. ఇక చిరంజీవి అంటే తన కుటుంబం మొత్తానికి ఎంతో ఇష్టం అని బయటపెట్టింది. తన తండ్రితో కలిసి చిరు సినిమాలను వెళ్లిన రోజులను పూనమ్ గుర్తు చేసుకుంది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘ముఠామేస్ర్తి’ సినిమాలతో తన తండ్రితో కలిసి థియేటర్ లో చూశానని తెలిపింది. రామ్చరణ్ గురించి ఎన్నో చెప్పాలని ఉన్నా.. ఇది సమయం కాదని తెలిపింది. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని పూనమ్ చెప్పింది.

భార్య‌తో విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్ట‌ర్

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్న ఆలియా భ‌ట్

పూర్తిగా మారిపోయిన మీరా జాస్మిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -