Friday, May 3, 2024
- Advertisement -

సంక్రాంతి రేస్ నుంచి ” ఆది పురుష్ ” ఔట్ ?

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ప్రస్తుతం ” అది పురుష్ ” మూవీ రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు చిత్రా యూనిట్ గతంలోనే అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీని వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బడా స్టార్లు పోటీ పడుతుండడంతో రేస్ నుంచి ” ఆది పురుష్ ” తప్పుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ” వాల్తేరు వీరయ్య ” మరియు నటసింహ బాలయ్య బాబు ” వీరసింహారెడ్డి ” మూవీస్ తో పాటు విజయ్ తలపతి ” వారసుడు ” మూవీ కూడా ఈ సంక్రాంతికే రానుంది ఈ నేపథ్యంలో తెలుగు తమిళ్ నుంచి ఆది పురుష్ కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది..

అంతే కాకుండా అటు హిందీలో కూడా బాలీవుడ్ స్టార్ హీరో సంక్రాంతిని టార్గెట్ చేశాడట. దాంతో ” ఆది పురుష్ ” ను సంక్రాంతి రేస్ నుంచి తప్పించి 2023 సమ్మర్ కు రిలీజ్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా ” ఆది పురుష్ ” వాయిదా వేయడానికి కారణం పోటీ ఎక్కువ ఉన్నందువల్ల కాదని గ్రాఫిక్సే ప్రధాన కారణం అనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల రిలీజ్ అయిన ” ఆది పురుష్ ” టీజర్ లో గ్రాఫిక్స్ ఫెలవంగా ఉండడంతో గ్రాఫిక్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకునే పనిలో దర్శకుడు ఓం రౌత్ ఉన్నాడట. అందుకే ఆది పురుష్ ను సంక్రాంతి నుంచి సమ్మర్ కు పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ వాయిదా కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి, అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ ” ఆది పురుష్ ” వాయిదా గ్యారెంటీ అనే వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మహేశ్ టార్గెట్ 2025 .. 

చిరు ఆశాలన్నీ ” వాల్తేరు వీరయ్య ” పైనే !

చరణ్- అర్జున్ తో భారీ మల్టీ స్టారర్.. బడా ప్రొడ్యూసర్ క్లారిటీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -