Thursday, May 2, 2024
- Advertisement -

T20 WORLDCUP 2022 : టీమిండియాకు బంగ్లాదేశ్ ప్రమాదకరమే !

- Advertisement -

టి20 వరల్డ్ కప్ లో మరో కీలక సమరానికి టీమిండియా సిద్దమైంది. అడిలైడ్ వేదికగా భారత్ నేడు బంగ్లాదేశ్ తో తలపడనుంది. పాకిస్తాన్, నెదర్లాండ్ జట్లపై గెలిచిన టీమిండియాకు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది. దాంతో రెండు విజయాలు ఒక ఓటమితో టీమిండియా పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. సెమీస్ కు మరింత దగ్గరయ్యేందుకు బంగ్లాదేశ్ పై విజయం టీమిండియా కు చాలా అవసరం. ఇక బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం. దాంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కూడా కీలకమే. ఇక టీమిండియా బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో బలంగానే ఉంది. అయితే టీమిండియా స్టార్ ఓపెనర్ కే‌ఎల్ రాహుల్ గత మూడు మ్యాచ్ లలోనూ ఘోరంగా విఫలం అయ్యాడు..

దాంతో నేడు జరిగే మ్యాచ్ లో రాహుల్ కు స్థానం కల్పిస్తారా లేదా అనేది ఆసక్తికరమే. ఇక సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ గాయం అయింది. దాంతో ఈ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ కు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. డికె స్థానంలో రిషబ్ పంత్ కు చోటు దక్కే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో అశ్విన్ గత మ్యాచ్ లలో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. దాంతో అతడి స్థానంలో చహల్ ని తీసుకోవాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఫీల్డింగ్ విషయంలో భారత్ మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉంది.

ఎందుకంటే సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ లోపం కరణంగానే మ్యాచ్ ఓటమిపాలు అయింది. దాంతో అన్నీ విభాగాల్లోని లోపాలను సారి చేసుకొని బంగ్లాదేశ్ తో బరిలోకి దిగాల్సిఉంది టీమిండియా. ఎందుకంటే తమకు వరల్డ్ కప్ ముఖ్యం కాదని, టీమిండియాను ఓడించడమే తమ ప్రధాన లక్ష్యం అని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హాసన్ గట్టిగా హెచ్చరిస్తున్నారు. దాంతో బంగ్లాదేశ్ జట్టు టీమిండియానూ ఓడించడం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల బంగ్లాదేశ్ నూ ఏమాత్రం తక్కువ అంచనా వేసిన టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో ఎలా రాణిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -