ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు సెలవులు.. ఎక్కడంటే..?

మధ్యప్రదేశ్​ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లపాటు సెలవులు ఇవ్వనుంది. ఈ టైంలో వారికి సగం జీతం మాత్రమే చెల్లించనున్నారు. కరోనా ఎఫెక్ట్​తో మధ్యప్రదేశ్​ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలనే విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్​రాజ్​సింగ్​ చౌహాన్​.. ఆర్థిక శాఖ నిపుణులతో సుధీర్ఘంగా చర్చలు జరిపారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను వారు ఆయన ముందుకు తీసుకొచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్​శాఖ, రెవెన్యూ, విద్య వంటి అత్యవసర విభాగాలకు ఇందులో మినహాయింపు ఇచ్చారు. మిగతా శాఖల్లో కొద్ది మందిని మాత్రమే ప్రభుత్వ విధులకు ఉపయోగించుకోనున్నారు. మిగతా వాళ్లకు ఐదేళ్లపాటు సెలవులు ఇవ్వనున్నారు. అయితే ఇటువంటి నిర్ణయం దేశంలో ఇదే మొదటిసారని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగసంఘాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

ఇక సదరు ఉద్యోగులు కోర్టులకు వెళితే ఎటువంటి పరిస్థితి వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలంటే ఇంతకు మించి మార్గం లేదని ఆ రాష్ట్రంలోని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ. 6 వేల కోట్లు ఆదా అవుతుందని సమాచారం. కరోనా ప్రభావంతో మధ్యప్రదేశ్​ ఆర్థికంగా దెబ్బతిన్నది. ఆ రాష్ట్రానికి ప్రస్తుతం 2.50 లక్షల కోట్లు అప్పులున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల పాటు సెలవులు ప్రకటించాలన్న ప్రతిపాదన ముఖ్యమంత్రి వద్దకు వచ్చింది. ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయంపై సాధ్యాసాధ్యాల గురించి ఆయన చర్చిస్తున్నారు.

Also Read

5 పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

‘భయం’ తెలియని వ్యక్తులే కాంగ్రెస్​కు కావాలి..! రాహుల్ గాంధీ..!

థర్డ్​వేవ్​ వచ్చేస్తోందా? భయపెడుతున్న కొత్త వేరియంట్లు..!

Related Articles

Most Populer

Recent Posts