Friday, April 19, 2024
- Advertisement -

కేజీఎప్‌-2తో ఢీకొట్టబోతున్న విజయ్‌ మూవీ

- Advertisement -

చాలా కాలం తర్వాత రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ వాతావరణం తప్పేలా లేదు. అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న కేజీఎఫ్-2కు విజయ్‌ యాక్షన్ థ్రిల్లర్ బీస్ట్ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. కేజీఎఫ్‌ కు సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్‌-2 ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. బీస్ట్ ఒక్క రోజు ముందుగానే ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా ఈ విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ దుమ్మురేపుతోంది. యాక్షన్ హంగామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ స్పై ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఉగ్రవాదులను మట్టుబెట్టే మిషన్‌లో విజయ్ ఏం చేస్తాడు అన్నది ట్రైలర్‌ చూస్తే ఆసక్తి రేపుతోంది.

ఈ మూవీకి నెల్సన్‌ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహించారు. విజయ్‌కు జంటగా పూజా హెగ్డే కనిపించబోతోంది. తమిళం, తెలుగుతో పాటు పలు భాషల్లో బీస్ట్‌ను రిలీస్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

భారీగా రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిన కృతి శెట్టి

మళ్లీ తెరపై చిరు విశ్వరూపం

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -