Wednesday, April 24, 2024
- Advertisement -

సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్ రాధేశ్యామ్!

- Advertisement -

పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న నేచురల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్” మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నా “రాధేశ్యామ్” మూవీ రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.

ప్రేమికుల రోజు కానుకగా “రాధేశ్యామ్” మూవీ ఫస్ట్ గ్లిమ్స్ పేరిట శాంపుల్ విజువల్స్‌ వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది చిత్రబృందం. విజువల్స్‌లో హీరోయిన్ “నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా’ అంటే, ఛ… వాడు ప్రేమకోసం చచ్చాడు.నేను ఆ టైప్ కాదు’.. అంటూ ప్రభాస్ తన ప్రేమని తెలియజేసే గ్లింప్స్ ఆసక్తికరంగా ఉంది. తాజాగా ఈ గ్లింప్స్ వీడియో సుమారు 5 లక్షల లైక్స్ సాధించి, ఐదు లక్షల లైక్స్ సాధించిన ఫస్ట్ ఎవర్ గ్లింప్స్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Also read:టాలీవుడ్ 100 కోట్ల సినిమా.. అక్కడ మాత్రం అట్టర్ ప్లాప్!

పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రేజీ ప్రాజెక్ట్ అయినా‘ఆదిపురుష్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.”రాధేశ్యామ్” మూవీ జూలై 30న ప్యాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

Also read:ఆ సినిమా రీమేక్ చేస్తే.. బెల్లంకొండ బ్రదర్స్ పరువు పోతుంది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -