Wednesday, April 24, 2024
- Advertisement -

గ్రేటర్ పరిధిలో ఇంటింటి సర్వే.. టీ సర్కార్ కీలక నిర్ణయం

- Advertisement -

తెలంగాణలో ఈ మద్య కరోనా కేసులు ఎంత ఘోరంగా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోవడంతో టీ సర్కార్ రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తుంది. అయితే కరోనా పెరిగిపోవడానికి కారణం ప్రజల నిర్లక్ష్యం అని.. కరోనా రోగులు సైతం జనాల్లో తిరగడం వల్లనే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి తాజా పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి సర్వే కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ప్రతి బృందంలో ఇద్దరు మున్సిపల్ స్టాఫ్, ఇద్దరు ఆశా వర్కర్లు, ఒక ఏఎన్ఎం ఉండేలా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులకు స్పష్టం చేశారు. కరోనా లక్షణాలతో బాధపడే వ్యక్తులను గుర్తించడానికి బృందాలు ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటినీ సందర్శించాలని ఈ సందర్బంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ బృందాలు మెడిసిన్ కిట్లను అప్పగిస్తాయని… కరోనా రోగ లక్షణాలున్న వ్యక్తులకు వాటిని ఎలా తీసుకోవాలో సలహా ఇస్తాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా హెల్ప్‌లైన్ కాల్ సెంటర్ నెంబర్ 040-2111-1111ను సంప్రదించాలని కోరారు.

బంగ్లాదేశ్ లో ఓ ఘోరం.. పడవ మునిగి 25 మంది మృతి

ఆ సినిమాను పక్కన పెట్టి.. ఇంకో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన నితిన్!

కొత్తూరు మున్సిపాలిటీ లో ఎగిరిన గులాబీ జెండా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -