Friday, April 26, 2024
- Advertisement -

ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ అప్పుడే…?

- Advertisement -

పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.కరోనా తర్వాత సినిమా షూటింగులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభాస్ “రాధేశ్యామ్” సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతుండడంతో ఈ సినిమా చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో పూర్తవుతుంది.

ప్రభాస్ “రాధేశ్యామ్” పూర్తికాగానే తన తదుపరి సినిమాలైన “సలార్”, “ఆది పురుష్” చిత్రాలలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలోనే కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో సినిమా షూటింగులు ఆగిపోయాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి సినిమా షూటింగ్ లను పునః ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తున్నారు.

Also read:ప్రమాదంలో ఎడమ కన్ను చూపు కోల్పోయిన కత్తి మహేష్?

ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న సినిమాలో ప్రభాస్ శృతిహాసన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టు నెలలో ప్రారంభంకానుందని ఈ సందర్భంగా చిత్ర బృందం వెల్లడించారు. అదేవిధంగా సలార్ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు.

Also read:రసవత్తరంగా మారిన “మా” ఎన్నికలు.. బరిలోకి ఓ. కళ్యాణ్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -