Thursday, April 25, 2024
- Advertisement -

మడమశూల (పాదాల వాపు) నొప్పినివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

- Advertisement -

కాళ్లవాపు అనేది సర్వ సాధారణ సమస్య. కానీ ఇది చాలా కలవర పరుస్తుంది. ఉదయం లేచినప్పుడు అంతా బాగానే ఉంటుంది. రోజు గడుస్తున్న కొద్దీ పాదాలు, కాళ్లు బండల్లా వాచి ఉబ్బిపోతూ ఉంటాయి. నిజానికి ఇది గుబులురేపే సమస్యే అయినప్పటికీ కొద్దిగా అవగాహన పెంచుకుంటే దీనికి మూలాలు ఎక్కడో తేలికగానే తెలుసుకోవచ్చు. తద్వారా సకాలంలో వైద్యం చేయించుకుని ఉపశమనం పొందొచ్చు.


కాళ్లవాపు వచ్చి నప్ఫుడు భయంతో వణికిపోతుంటాం. అయితే.. ఇది రావడానికి కారణాలను తెలుసుకుంటే సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోవచ్చు. కాళ్లకు వాపు వచ్చినప్పుడు ముఖ్యంగా రెండు అంశాలను పరిశీలించాలి. వాపు రెండు కాళ్లకా.. ఒకదానికేనా? అనేదానిబట్టి సమస్య తీవ్రతను గుర్తించొచ్చు.

ఇక దీని లక్షణాలను ఎలా గుర్తించాలంటే.. వాపు పాదమునకు గానీ లేదా చీలమండ ప్రాంతానికి గాని సంబంధించి నొప్పి లేకుండా ఉండి కాలముతో పాటు నొప్పి పెరిగితే , చర్మం రంగు మరియు చర్మం నిర్మాణంలో మార్పు రావచ్చు. జబ్బుఇతర లక్షణాలు చర్మం ఉష్ణోగ్రత పెరగడం, తాకినప్పుడు వేడి స్పర్శ కలగడం, పుండు ఏర్పడటం మరియు చీము ఉత్సర్గం వంటివి.

నొప్పినివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • ఎక్కువ సమయం నిలబడిన కారణంగా వాపు ఏర్పడినప్పుడు దానిని విశ్రాతి తీసుకోవడం ద్వారా లేదా పాదాలను ఎత్తులో ఉంచడం ద్వారా నయం చేసుకోవచ్చు. పడుకొన్నప్పుడు మీ కాళ్లను తలదిండుపై గుండె కంటె ఎక్కువ ఎత్తులో ఉండే విధంగా ఉంచుకోండి.
    -పాదాల వాపు గుండె జబ్బుల కారణంగా ఏర్పడితే, లేదా ద్రవం నిలవడం వల్ల జరిగితే, మీ డాక్టరు ఉప్పు వాడకాన్ని నియంత్రిఛమని సలహా ఇవ్వవచ్చు.(తక్కువ ఉప్పుతో ఆహారం) మరియు ఎక్కువగా నీరు త్రాగమని సూచించవచ్చు.
  • వాపు వేడి వాతావరణం కారణంగా ఏర్పడితే మీరు దానిని సులభంగా నివారించవచ్చు, దానికోసం వేడి వాతావరణానికి దూరంగ ఉండండి. మీ పాదాలను చల్లగా ఉంచుకోంది, దీనికై 15-20 నిమిషాలపాటు మీ పాదాలను చల్లని నీటిలో ఉంచండి.
  • కంప్రెషన్ స్టాకింగులు అరుదుగా ప్రయోజనం కల్పిస్తాయి. తీవ్రమైన వాపు కలిగినవారు సాధారణంగా వాటిని సహించలేరు.
  • మీ శరీరపు బరువు ఎక్కువ కావడం వల్ల కూడా పాదాల వాపు కావచ్చు. ఈ సందర్భంగా మీ డాక్టరు తగిన ఆహారాన్ని తీసుకోమని, వ్యాయామం చేయమని చెప్పవచ్చు. ఇవి శరీరపు బరువును తగ్గిస్తాయి.
  • తీవ్రమైన గాయాల సందర్భంగా డాక్టరు బలవంతంగా తోయడం, శస్త్రచికిత్స మరియు ప్రక్రియలు మరియు హెచ్చు నొప్పి నివారణకై విశ్రాంతి సూచించవచ్చు
  • రక్తం స్థాయి తక్కువ మరియు వేధించే గుండె జబ్బులకు (హెచ్చుస్థాయి రక్తపోటు, హై కొలస్ట్రాల్ వంటివి) మీ డాక్టరు ఔషధాలు సూచించవచ్చు. తక్కువ ప్రోటీన్ ఆహారం, క్యాల్షియం మరియు విటమిన్ డి పోషకాంశాలు, ఆరోగ్యకరమైన జీవన సరళిని కూడా సూచించవచ్చు
  • వాపు ఉన్న చోట వీలయిన వెంటనే ఐసును 15- 20 నిమిషాలపాటు ఉంచండి. తర్వాత ఈ ప్రక్రియను మూడు నాలుగు గంటలకు ఒకమారు కొనసాగించంది.. ఈ చర్య తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -