Tuesday, April 23, 2024
- Advertisement -

ఫస్ట్ మూవీతోనే షాక్ తిన్న ప్రియా ప్రకాష్ వారియర్…!

- Advertisement -

క‌న్నుగీటుతో కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. ప్ర‌స్తుతం తెలుగు, మ‌ల‌యాళం, హిందీ సినిమాల్లో నటిస్తుంది.  నితిన్ హీరోగా వచ్చిన చెక్ సినిమాలో ప్రియా వారియర్ నటిస్తుందంటే ఎంత పెద్ద పాత్ర చేస్తుందో అనుకున్నారంతా. కానీ కనీసం 15 నిమిషాలు కూడా లేని ఈ పాత్రలో ప్రియా మెరుపుతీగలా వచ్చి వెళ్లిపోయింది. చెక్‌ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్‌, నితిన్ మధ్య కొన్ని లవ్ సీన్లు, సాంగ్ మాత్రమే ఉంటాయి.

ఇలా వచ్చి అలా వెళ్లిపోయిందన్నట్టుగా సాగుతుంది. కనిపించినంత సేపు హాట్ లుక్ తో కనిపించింది. అయితే తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్న ప్రియావారియర్‌కు చెక్ సినిమా అంతగా కలిసి రాలేదని ఫీలవుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. ప్రమోషన్స్‌లో ఎంత పాల్గొన్నా కూడా సినిమా విడుదలైన తర్వాత ఈమె పాత్ర గురించి పెద్దగా ఎవరూ చర్చించుకోవడం లేదు.

రాక రాక తెలుగులో చంద్రశేఖర్ యేలేటి ఇచ్చిన ఈ ఆఫర్ ఈ హాట్ బ్యూటీ కెరీర్‌కు చిక్కు తెచ్చిపెట్టిందంటూ గాసిప్స్ హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతున్నాయి.  ప్రస్తుతం ఈమె కెరీర్ నిలబడాలంటే అద్భుతాలు జరగాలి. కానీ జరిగేంత పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగులో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది ప్రియా.

న్యాయవాద దంపతుల హత్య కేసులో కత్తులు దొరికాయి.. ఎక్కడంటే..!

వైసిపి లేఖ.. ఎందుకంటే ఫోస్కో సంస్థకి ఆహ్వానం..!

ఆరోగ్య మంత్రికి టీకా.. సేఫ్ అంతే నా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -