Friday, March 29, 2024
- Advertisement -

వైసిపి లేఖ.. ఎందుకంటే ఫోస్కో సంస్థకి ఆహ్వానం..!

- Advertisement -

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రముఖ ఫోస్కో సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపింది. ఈ మేరకు పోస్కో ఇండియా సీఎండీ సుంగ్ లే చున్​కు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్. కరివల్ వాలెన్ లేఖ రాశారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందని లేఖలో తెలిపారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని, దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను రాష్ట్రం అవలంబిస్తుందని పేర్కొన్నారు. కృష్ణపట్నం పోర్టు దక్షిణ ఆసియాలో అతిపెద్ద ఆటోమేటెడ్ పోర్టులలో ఒకటని, చెన్నై, బెంగళూరు వంటి వివిధ పట్టణ కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రాంతమని వివరించారు.

వేగంగా అభివృద్ధి చేస్తున్న చెన్నై – బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్‌లో ఉందని తెలిపారు. పరిశ్రమ ఏర్పాటునకు అవసరమైన భూమిని పోస్కోకు అప్పగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -