Friday, April 19, 2024
- Advertisement -

న్యాయవాద దంపతుల హత్య కేసులో కత్తులు దొరికాయి.. ఎక్కడంటే..!

- Advertisement -

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో విచారణ ముమ్మరం చేశారు. హత్యకు ఉపయోగించిన కొడవళ్ల స్వాధీనానికి పోలీసులు యత్నాలు మొదలుపెట్టారు. ఉదయం కుంట శ్రీను, మరొకరిని పెద్దపల్లి జిల్లా పార్వతీ బ్యారేజీ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు… వారు 58-60 పిల్లర్ల మధ్య కొడవళ్లను పడేసినట్లు తెలుసుకున్నారు. ఏపీలోని విశాఖ నుంచి వచ్చిన గజ ఈతగాళ్లతో ఆయుధాల కోసం నాలుగు గంటలపాటు గాలించారు. బ్యారేజీలోని 58-60 పిల్లర్ల వద్ద ఈ గాలింపు జరిగింది.

అక్కడ నీరు 10 నుంచి 15 మీటర్ల లోతు వరకు ఉండటంతో.. గజ ఈతగాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మొత్తానికి న్యాయవాద దంపతుల హత్య సమయంలో నిందితులు వినియోగించిన కత్తులను పోలీసులు గుర్తించారు. పార్వతీ బ్యారేజీ వద్ద నిందితులు మారణాయుధాలను పడేసినట్లు గుర్తించిన పోలీసులు రెండ్రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టారు.

నిన్నంతా వెతికినా ఆయుధాలు లభించకపోవడంతో ఇవాళ గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీ నుంచి రప్పించిన గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 53వ పిల్లర్ వద్ద రెండు కత్తులు లభ్యమయ్యాయి.మారణాయుధాలను వెలికి తీసేందుకు పోలీసులు పెద్ద పెద్ద ఐస్కాంతాలు, డ్రోన్ కెమెరాలతో గాలించారు. మొత్తానికి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు లభ్యమవడంతో కేసులో కీలక ఆధారం లభించినట్లైంది.

ఆరోగ్య మంత్రికి టీకా.. సేఫ్ అంతే నా..!

కేటీఆర్ పంచ్ కి అంతా నవ్వులే.. కానీ వాళ్ళకి గట్టిగా తగిలింది..!

విమానాశ్ర‌యంలో చంద్రబాబు నిరసన.. సీన్ రివర్స్ అయ్యిందా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -