చనిపోయిన సీరియల్ హీరోయిన్ తో డేటింగ్ చేశానంటున్న నిర్మాత?

- Advertisement -

ప్రముఖ హిందీ టెలివిజన్ నటి ప్రత్యూష బెనర్జీ పలు విజయవంతమైన సీరియల్స్ మరియు రియాల్టీ షోలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రత్యూష బెనర్జీ మొదట “బాలికా వధు”సీరియల్లో ఆనందీ పాత్రలో అద్భుతంగా నటించి విశేషమైన ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ప్రత్యూష బెనర్జీ తెలుగు బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ప్రత్యూష బెనర్జీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఏప్రిల్ 1 2016 న ముంబైలోని ఆమె అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ప్రత్యూష బెనర్జీ గురించి బాలీవుడ్ నిర్మాత వికాస్‌ గుప్తా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. బుల్లితెర నటి ప్రత్యూష తాను ప్రేమించుకున్నామని తన గురించి ఎవరో చెడుగా చెప్తే ప్రత్యూష వాటిని నమ్మి నాతో తెగతెంపులు చేసుకుంది. అలా మేమిద్దరం కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత దూరం కావాల్సి వచ్చింది.నిజానికి ప్రత్యూష అంటే తనకెంతో ఇష్టమని, తనతో కలిసి ఓ పెద్ద ప్రాజెక్ట్‌ చేయాలనుకున్నానని ఇంటర్వ్యూలో తెలిపారు.

- Advertisement -

Also read:అరియానతో ఆర్జీవీ హాట్ వర్కౌట్స్.. వామ్మో!

అయితే వికాస్ గుప్త ఇచ్చిన ఇంటర్వ్యూ పై ప్రత్యూష బెనర్జీ క్లోజ్‌ ఫ్రెండ్‌ హిందీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కామ్య పంజాబీ అసహనం వ్యక్తం చేసింది. అతడు చెప్పింది నిజమా కాదా అన్నది నిర్ధారించేందుకు ప్రత్యూష మన మధ్య లేదు. వికాస్‌ ఇప్పుడెందుకు ఆమెతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో లేని వారి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది.

Also read:సమంత రంగుపై విమర్శలు వస్తాయని తెలుసు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -