Saturday, April 27, 2024
- Advertisement -

చెక్కపెట్టలో కొట్టుకొచ్చిన పసికందు..! ఎక్కడంటే?

- Advertisement -

సినిమాల్లో, కథల్లోనూ జరిగే ఓ అరుదైన ఘటన నిజజీవితంలో జరిగింది. 22 రోజులున్న ఓ పసికందును ఎవరో ఓ చెక్కపెట్టలో ఉంచి గంగా నదిలో పడేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో చోటుచేసుకున్నది. ఘాజీపూర్ లోని దాద్రి ఘాట్ వద్ద ఆ చెక్కపెట్టెను కొందరు గుర్తించారు. ఎవరో ఓ చెక్కపెట్టలో పసిపాపను పెట్టి వదిలేశారు. అందులో ఓ దేవుడి పటం కూడా ఉంచారు. పాప జాతకాన్ని కూడా ఉంచారు. ఈ పాపకు గంగ అనే పేరుపెట్టాలని ఓ కాగితం మీద రాసి పెట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

ఈ పాపను పెంచుకొనేందుకు ఓ వ్యక్తి ముందుకు వచ్చారు. కానీ ప్రస్తుతం ఈ పాప శిశు సంరక్షణ అధికారుల ఆధీనంలో ఉంది. ఓ ఆస్పత్రిలో పసికందును చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పాపకు స్వల్పంగా గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఘటన సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. పాపను వదిలేసిన తల్లిదండ్రులను నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.మరోవైపు ఈ ఘటన సీఎం యోగి ఆదిత్యనాథ్​ దృష్టికి వెళ్లింది. ఆయన మాట్లాడాతూ.. ’ పసికందు సంరక్షణను ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ పాపను ఎవరికీ అప్పగించం. అయితే ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతాం’ అని ఆయన పేర్కొన్నారు.

Also Read

హెచ్​సీఏలో అజహారుద్దీన్​ శకం ముగిసిట్టేనా?

తెలంగాణలో థియేటర్లు ఓపెన్..!

అప్పుడు తేజు సాహసం.. ఇప్పుడు చైతూ వంతు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -