Sunday, April 28, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌ షోపై పునర్నవి షాకింగ్‌ కామెంట్స్‌

- Advertisement -

పునర్నవి భూపాలం..అప్పుడెప్పుడో ఉయ్యాలా జంపాలా సినిమాలో నటించిందనే మాటే కానీ ఎవరికీ ఆమె గుర్తులేదు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు దగ్గరైంది. అప్పటిదాకా కొందరికే తెలిసిన ఆమె బిగ్ బాస్ పాల్గొన్నాక అందరికీ తెలిసిపోయింది. హౌస్‌లో ఈమె సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో నడిపిన లవ్ ట్రాక్ అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌ 3 సక్సెస్‌ కావడంలో వీరిద్దరి లవ్‌ట్రాక్‌ కూడా ఒక కారణమనే చెప్పొచ్చు. రాహుల్‌ పులిహార కలపడంతో సోషల్‌ మీడియాలో పునర్నవి పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది.

ఇక బిగ్ బాస్ నుంచి బయటికు వచ్చాక కూడా అటు రాహుల్, ఇటు పునర్నవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే పునర్నవి భూపాలం మాత్రం తాజాగా బిగ్ బాస్‌పై సంచలన కామెంట్స్ చేసింది. తన కెరీర్‌పై బిగ్ బాస్ పెద్దగా ప్రభావం చూపించలేదని.. షోకు వెళ్లడం ద్వారా తనకు అవకాశాలు పరంగా పెద్ద తేడా ఏం కనిపించలేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

తన కెరీర్‌కు బిగ్ బాస్ షో ఎలాంటి హెల్ప్ చేయలేదని, సోషల్ ప్రొఫైల్ పెంచుకోవడంలో కూడా ఉపయోగపడలేదని చెప్పుకొచ్చింది. కానీ ఆ షోతో జరిగిన ఒకే ఒక్క మంచి ఏంటంటే.? ఫ్యాన్స్‌కు మరింత దగ్గర కావడమే అని పునర్నవి పేర్కొంది. పునర్నవి చేసిన కామెంట్స్‌ని కొందరు తప్పుబడుతుండగా.. ఇంకొందరు బిగ్ బాస్ వల్ల పునర్నవికే కాదు ఏ ఒక్క కంటిస్టెంట్‌కి గానీ, ప్రేక్షకులకు గానీ ఉపయోగం లేదంటూ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం పునర్నవి నటించిన వెబ్ సిరీస్ ‘కమిట్‌మెంటల్’ ఆహా ఓటీటీలో అలరిస్తోంది.

బిగ్ బాస్ 4 విజేత ఎవరో అప్పుడే టాం టాం?

జబర్ధస్త్ స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న హైపర్ ఆది!

ఆ ముద్దు పేరు నాకు నచ్చలేదు.. తెగ ఫీలవుతున్న తమన్నా

కంగ‌నా చేసిన అన్యాయాన్ని బయటపెట్టిన క్రిష్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -