Sunday, May 5, 2024
- Advertisement -

ఆ ముద్దు పేరు నాకు నచ్చలేదు.. తెగ ఫీలవుతున్న తమన్నా

- Advertisement -

హీరోయిన్ లకు ఫ్యాన్స్‌ ముద్దు పేర్లు పెడుతుంటారు. వింత వింత పేర్లతో తమ అభిమాన హీరోయిన్ ను పిలుస్తుంటారు. టాలీవుడ్ బ్యూటీ తమన్నాకు అలా పిలిస్తే నచ్చదట. అభిమానులు తమన్నాను ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు. పాలలా తెల్లని మేనిఛాయ కలిగిన ఈ ముద్దుగుమ్మను మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు ఫ్యాన్స్. అయితే ఆ పిలుపు ఈ అమ్మడికి నచ్చదట.

తాజాగా తమన్నా మాట్లాడుతూ.. ‘అభిమానులు మంచి ఉద్దేశంతోనే మిల్కీ బ్యూటీ అని పిలుస్తున్నా..నాకు ఆ పిలుపు నచ్చదు. శరీర వర్ణాన్ని బట్టి పేర్లు పెట్టడం తప్పు. మనదేశంలో తెలుపు రంగు చర్మం పట్ల అభిమానం,వ్యామోహం చాలా మందిలో కనిపిస్తోంది. కొన్నిసార్లు ఇలాంటి పేర్లు, ముద్రలు ఆత్మన్యూనతకు కారణమవుతాయి. మన టాలెంట్‌ను బట్టి ముద్దు పేర్లు పెడితే బాగుంటుంది. కానీ చర్మ రంగును బట్టి ముద్దుపేర్లు వద్దని’ తమన్నా చెప్పుకొచ్చింది.


ఇక ఇటీవల కరోనా బారిన పడిన తమన్నా.. కరోనాకు చికిత్స పొంది సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగులతో బిజీ అయిపోయింది. తమన్నా తెలుగులో గుర్తుందా శీతాకాలంలో నటిస్తోంది. ఈ సినిమా ఓ కన్నడ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. గోపీచంద్ సరసన సీటీమార్ సినిమాలో నటిస్తుంది. అలాగే ‘లెవెంత్‌ అవర్‌’అనే వెబ్ సిరీస్ లోకూడా నటిస్తుంది.

పెదవులపై ముద్దుపెట్టాలని కోరాడు : సాయిపల్లవి

దిల్‌ రాజు బర్త్‌డే పార్టీ : పిలిచినా వెళ్లని ఎన్టీఆర్‌ కారణం అదే..

ట్యూన్‌ కాపీ చేసిన తమన్‌.. ‘కింగ్‌’ సీన్‌తో నెటిజన్లు ట్రోలింగ్‌

రూమర్లపై క్లారిటీ ఇచ్చిన పవన్‌ మాజీ భార్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -