Wednesday, May 1, 2024
- Advertisement -

చంద్రబాబు, వైఎస్‌ జగన్‌లపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేనతో కలిసి బీజేపీ ఎదుగుతోందని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. రాయలసీమకు తరతరాలుగా అన్యాయం జరుగుతోందని, సీమకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన మంత్రాలయం మండలంలో నిర్మించిన పుష్కర ఘాట్లను పరిశీలించారు. అక్కడే కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోడు దొంగలు అని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అవినీతిపై పెద్ద పుస్తకాన్ని ప్రచురించిన వైసీపీ… ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు బలహీనపడితే మరొకరు పైకొస్తారన్న ఉద్దేశంతోనే జగన్ ఆయన అవినీతి గురించి మాట్లాడట్లేదని ఆరోపించారు.

బీజేపీ అధికారంలోకి వస్తేనే సీమ అభివృద్ధి
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో రాయలసీమ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలన్నారు. రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం విషయంలో కేంద్రాన్ని సాయం కోరినట్లు సీమ అభివృద్ధి విషయంలో ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే సీమ అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇసుక కన్నా బంగారం చాలా సులువుగా దొరుకుతోందని భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు.

రాయలసీమ అభివృద్దిపై రెఫరెండాని సిద్ధమా?
అమరావతిలో రాజధానిపై రెఫరెండానికి సిద్దమా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారన్న సోము వీర్రాజు.. వైసీపీ,టీడీపీలు రాయలసీమ అభివృద్దిపై రెఫరెండానికి సిద్దమా అని ప్రశ్నించారు. రాయలసీమలో రెఫరెండం పెడితే ప్రజలు ఏం చెప్తారో తెలుస్తుందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ.7200కోట్లు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఫేక్‌ ట్వీట్‌ చేసి అడ్డంగా బుక్కైన చంద్రబాబు

ఆయనకు ఇదే మొదటి, చివరి ఎన్నికలు : మంత్రి ఎర్రబెల్లి

టీపీసీసీ చీఫ్‌ ఫిక్స్‌.. రాష్ట్ర పగ్గాలు ఆ నేతకే

ఏడాది పాటు అవన్ని రద్దు చేయాలి.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -