Tuesday, April 23, 2024
- Advertisement -

వామ్మో.. ది ఫ్యామిలీ మెన్ సమంత లుక్ ఏంటి ఇలా ఉంది!

- Advertisement -

నేచురల్ బ్యూటీ సమంతకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న సమంతా టాలీవుడ్‌లో అగ్రనటిగా రాణిస్తూనే, “ప్రత్యూష సపోర్ట్” అనే స్వచ్చంద సేవా సంస్థ ప్రారంభించి బడుగు, బలహీల వర్గాల పిల్లలకు విద్య, వైద్యం అందిస్తూ తన వంతు సామాజిక సేవలను అందిస్తోంది.సమంత వ్యక్తిత్వం, అభినయం, అందంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది.

సమంత మొదటి సారి నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 త్వ‌ర‌లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తొలి సీజ‌న్ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి స్పందన రావడంతో దాని సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. నిన్న సమంత పుట్టినరోజు సందర్భంగా దర్శకులు రాజ్ సమంతకు స్పెషల్ విషెస్ చెప్తూ, వెబ్ సిరీస్ లో సమంత పాత్రకు సంబంధించిన ఒక ఫోటోను లీక్ చేశాడు ఫోటోలో సమంతను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే .సమంత పాత్ర పేరు రాజి అని కూడా చెప్పేశారు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. త్వరలోనే రాజీ సత్తా ఏంటో అందరికీ చూపించబోతోన్నామని చెప్పుకొచ్చారు దర్శకులు రాజ్ . ఇప్పటి వరకు టాలీవుడ్ కోలీవుడ్ కే పరిమితమైన సామ్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోంది.

Also read:పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే పనికిరాడా? సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శాకుంతలం’ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ సమంతకి జంటగా దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. తన కెరీర్‌లో తొలిసారి పౌరాణిక పాత్ర పోషిస్తోంది. సమంత ఇప్పటివరకు క్లాస్, మాస్ పాత్రలతో మెప్పించారు. ఇక ఈ పౌరాణిక పాత్రలో ఏ మేరకు ప్రేక్షకులను ఆకర్షిస్తుందో వేచి చూడాలి మరి.

Also read: 9 భాషల్లోకి రీమేక్ అయిన మన టాలీవుడ్ మూవీ ఏంటో తెలుసా…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -