Thursday, April 25, 2024
- Advertisement -

షాక్.. కర్ణాటకలో 3వేల మంది కరోనా రోగులు అదృశ్యం

- Advertisement -

దేశంలో ఓ వైపు కరోనా కాటుకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతిరోజే దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింద. బెంగళూరు నగరంలో కరోనా సోకిన 3 వేల మందికి పైగా వ్యక్తులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు.

వీరంతా తమ మొబైల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నారని, దీంతో వారి ఆచూకీ కనుక్కోవడం కష్టతరం అవుతోందని ఆయన అన్నారు. ఈ సందర్భాగా ఆయన మాట్లాడుతూ.. నేను వారికి చేతులు జోడించి ఒకటే చెప్పాలని భావిస్తున్నాను.. మీరు చేస్తున్న ఈ పొరపాటు వల్ల కేసుల సంఖ్య పెరుగుతోంది.

కరోనా విషమించిన తర్వాత ఆసుపత్రుల్లోకి రావడం వల్ల మరింత కష్టం కలుగుతుందని అన్నారు. చాలా మంది తమ ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అదృశ్యమైన వారంతా ఇళ్లల్లో లేరు. వారెక్కడున్నారో తెలియడం లేదు. వెంటనే అందరూ వైద్యాధికారులను సంప్రదించాలి.. లేదంటే పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుందని అన్నారు. కాగా, బుధవారం నాడు రాష్ట్రంలో దాదాపు 39 వేల కేసులురాగా, 229 మంది కన్నుమూశారు.

వామ్మో.. ది ఫ్యామిలీ మెన్ సమంత లుక్ ఏంటి ఇలా ఉంది!

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా రక్కసి.. ఒక్క‌రోజులో 58 మంది మృతి

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు శుభవార్త!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -