Friday, May 3, 2024
- Advertisement -

‘బాహుబలి 2’ ట్రైలర్‌ రివ్యూ.. సంచలనం సృష్టిస్తోంది

- Advertisement -
Rajamouli Bahubali 2 Trailer Review

ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న బాహుబలి 2 ట్రైలర్ వచ్చేసింది. మొదటి పార్ట్ ను మించేలా రెండవ పార్ట్ ఉంటుందని మొదటి నుంచి బాహుబలి యూనిట్ సభ్యులు చెబుతూ వస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత వారు చెప్పిందే నిజమే అని తేలిపోయింది. గత రెండు సంవత్సరాలుగా కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అనే విషయంపై ట్రైలర్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

అద్బుతమైన విజువల్స్, అపురూపమైన సెట్టింగ్స్ తో పాటు అద్బుతమైన టేకింగ్ తో విజువల్స్ అదిరిపోయాయి. యుద్ద సన్నివేశాలు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకు వెళ్లడం ఖాయంగా అనిపిస్తుంది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీ ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇక కట్టప్పతో బాహుబలి చెప్పే డైలాగ్.. నువ్వు పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ.. సినిమా స్థాయిని పెంచుతుంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాల్సి వచ్చిందో అనే విషయం మరింత ఆసక్తిగా మారింది. ఇక ట్రైలర్ ఈ రెంజ్ లో ఉంటే సినిమా ఏ రెంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వచ్చే నెల ఈ సినిమా 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యూట్యూబ్ లో కూడా ఇప్పుడు ఈ ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. 

{youtube}qD-6d8Wo3do{/youtube}

{youtube}v=mDmFxczl3oE{/youtube}

Related

  1. బాహుబలిని చంపింది కట్టప్ప కాదు.. బయటపడ్డ సీక్రెట్‌
  2. 2 ట్రైలర్లు,4 క్లైమ్యాక్స్ లు.. వాట్ ఏ బాహుబలి స్ట్రేటజీ సర్ జీ!
  3. బాహుబలి రిలీజ్ చేస్తే.. థియేటర్లను తగులబెడుతారట..!
  4. ప్రభాస్ అసలు బాహుబలి చేయడానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -