Monday, May 20, 2024
- Advertisement -

వర్మలో వచ్చిన తేడా… ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

- Advertisement -
Ram Gopal Varma Change

కొత్త సినిమాలు తీసి ట్రెండ్ సెట్ చేయడంలోనూ సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ రామ్ గోపాల్ వర్మ రూటు సపరేటు. వర్మ చాలా సార్లు చాలా మందిని విమర్శించినా కొన్ని కొన్ని సార్లు మాత్రం నిజాలే మాట్లాడుతుంటాడని ఒప్పుకోవాలి. మాటలకు ముసుగువేయకుండా కొన్ని వాస్తవాల్ని ఓపెన్ గా డిస్కస్ చేస్తుంటాడు వర్మ. రీసెంట్ గా హోలీ సందర్భంగా అతను  చేసిన ట్వీటే ఇందుకు ఉదాహరణ. అటువంటి వర్మలో ఇప్పుడు తేడా వచ్చిందా అంటే అవుననే అంటున్నారు అతని సన్నిహితులు.

ఇప్పటివరకు సోషల్ మీడియాలో కేవలం కామెంట్లు పెట్టి వదిలేసేవాడు.. ఎవరేమీ అన్నా పట్టించుకునే వాడు కాదు వర్మ. అయితే ఇప్పుడు వివాదాలు వస్తుంటే  సారీ చెప్పి కాంప్రమైజ్ అవుతున్నాడు.  అలానే  ఇప్పటి వరకు ఏ సెంటిమెంట్ ని ఫాలో అవ్వని వర్మ  సర్కార్-3 రిలీజ్  విషయంలో మాత్రం కాస్త సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు.  తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు కనీ వినీ ఎరుగని రీతిలో సర్కార్ -3 సినిమాని తన పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేయనున్నాడు. ఇక తనకు ఏ మాత్రం ఎమోషన్స్  లేవని గతంలో చెప్పిన వర్మే అమితాబ్ ఇంటర్ వ్యూ చూసి కన్నీరు పెట్టుకున్నానని ట్వీట్ చేశాడు.

అలానే గతంలో తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి  ఏ మాత్రం హింట్ ఇవ్వని వర్మ ఇప్పుడు చెప్పేస్తున్నాడు.  వర్మ వాళ్ల అమ్మగారు కూడా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్ వ్యూలో రాము ఓ యోగిలా, సైంటిస్ట్ లా అనిపిస్తాడని తెలిపారు. మరి అటువంటి వర్మకు ఇప్పుడు ఏమైంది… ఇంతకుముందు ఎన్నడూ జరగని విధంగా ఇప్పడూ ఈ పరిణామాలు ఎందుకు సంభవిస్తున్నాయి. అంటే అందుకు ఒక్కటే సమాధానం వినిపిస్తోంది. వర్మకు వయసు మీద పడుతోంది.. అందుకే ఆలోచనా విధానంలో కూడా మార్పు వస్తోందట. ఇదే నిజమైతే  శివ లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలను వర్మ తీయడం కూడా కష్టమవతుందేమో. 

Related

  1. వర్మకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సుస్మితా
  2. చిరు దెబ్బకి బయపడిన వర్మ.. అందుకే ఈ ట్వీట్స్..?
  3. శాతకర్ణి పై వర్మ కామెంట్స్.. ఖైదీ పై సెటైర్స్
  4. వర్మ హీరోయిన్ వ్యభిచారిణిగా మారింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -