Monday, April 29, 2024
- Advertisement -

మలయాళంలో రాజశేఖర్.. తెలుగులో శేఖర్..!

- Advertisement -

తెలుగు లో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్. అంకుశం, ఆహుతి లాంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించిన రాజశేఖర్ తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా పలు చిత్రాల్లో నటించారు. తన సహనటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత గరుడవేగ చిత్రంలో నటించి మంచి విజయం అందుకున్నాడు.

ఆ తర్వాత కల్కి చిత్రంలో నటించారు. తాజాగా రాజశేఖర్‌ రంగంలోకి దిగబోతున్నారు. ఆయన కొత్త చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్‌’ రీమేక్‌లో రాజశేఖర్‌ నటించబోతున్నారు. తెలుగులో ‘శేఖర్’​ అనే టైటిల్​తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈరోజు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్​లుక్​ని విడుదల చేసింది చిత్రబృందం.

ఈ మధ్యనే కల్కి సినిమాతో రేసులోకి అడుగు పెట్టిన రాజశేఖర్.. ఈ సినిమాతో మళ్ళీ పోటీలోకి వస్తారు ఏమో చూడాలి. ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ జీవితా రాజశేఖర్ దంపతులు హల్ చల్ చేస్తారు.

డియర్ మేఘ.. మేఘా ఫస్ట్ లుక్ అదుర్స్..!

ఈట‌ల‌ను సీఎం చేస్తే త‌ప్పేంటి?

అచ్చెన్నాయుడుకి బెయిల్‌ వస్తుందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -