Monday, April 29, 2024
- Advertisement -

బాబు మాటలతో విస్మయానికి గురైన క్యాడర్!

- Advertisement -

ప్రత్యర్థిని బెదిరించి కటకటాల పాలైన టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడి అరెస్టును ఖండిస్తూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలనే విస్మయానికి గురి చేశాయి. రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల టీడీపీ నేతలతో బాబు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట‌లు అచ్చెన్నాయుడు త‌ప్పు చేశాడ‌నే సంకేతాన్ని పంపాయ‌ని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ‘టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఎవరికో ఫోన్‌ చేశారని అరెస్టు చేశారు. ఫోన్‌ చేసి అభ్యర్ధులను బెదిరించిన వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబును ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో చట్టం వైసీపీకి చుట్టంగా మారిందా? ఐపీసీని జేపీసీగా మార్చారా? అని బాబు గద్దించారు.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అధికార పార్టీ అండ‌గా ఏకంగా ఎమ్మెల్యేలే బెదిరింపుల‌కు దిగ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు, నిల‌దీత‌లు ఎదుర‌వుతున్నాయి. కానీ చంద్ర‌బాబు మాట‌ల్లో అచ్చెన్న‌ను అరెస్ట్ చేశారు క‌దా? మ‌రి వైసీపీ ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని ప్ర‌శ్నించ‌డంతో …అచ్చెన్న త‌ప్పు చేశాడ‌ని బాబు ఆమోద ముద్ర వేసిన‌ట్టు అయిందని సొంత పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అచ్చెన్న ఎలాంటి బెదిరింపుల‌కు పాల్ప‌డ‌క‌పోయినా, అరెస్ట్ చేసి జైలు పాలు చేశార‌ని, మ‌రి అధికార పార్టీ ఎమ్మెల్యే బెదిరింపుల‌కు పాల్ప‌డినా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదని ప్ర‌శ్నించి ఉంటే స‌రిపోయేద‌ని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.

కాబోయే హోంమంత్రిని.. మీ అంతు చూస్తా!

ఇదిగో ఈ న్యూడ్ ఫొటో చూడు అన్న బుట్ట‌బొమ్మ‌

ఆప్రికాట్ తింటే చక్కటి ఆరోగ్యం!

తెలుగు లో ఉత్తమ నటీమణులు ఆనలుగురు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -