Friday, March 29, 2024
- Advertisement -

ఈట‌ల‌ను సీఎం చేస్తే త‌ప్పేంటి?

- Advertisement -

‘గులాబీ జెండా య‌జ‌మానులం. మంత్రి పదవి నాకు భిక్ష కాదు. కులం పేరుతో కొట్లాడి పదవి తెచ్చుకోలేదు. తెలంగాణ కోసం చేసిన ఉద్యమమే నన్ను మంత్రిని చేసింది’’ అంటూ తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ గతంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘పార్టీలు ఉండకపోవచ్చు… జెండాలు ఉండకపోవచ్చు… కానీ ప్రజలు ఎప్పటికీ ఉంటరు. ఆ ప్రజల పక్షాన నేను ఎల్లప్పుడు ఉంటా అని మొన్న మ‌రో సంచ‌ల‌నానికి తెర‌తీశారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం హుజురాబాద్‌లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఈట‌ల రైతుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఓవైపు ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ సీఎం అయితే త‌ప్పేంట‌ని గ‌తంలో ప్ర‌శ్నించిన ఈట‌ల‌, ఇప్పుడు కేటీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశాలు ఉన్నాయంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ ఇలాంటి మాట‌లు మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ బుధ‌వారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు పట్టం కట్టనున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఆయనకు బదులు మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం చేస్తే తప్పేముందని ఆయ‌న ప్రశ్నించారు.

ఇక టీఆర్ఎస్‌కు ఆది నుంచి ప‌ట్టు ఉన్న ప్రాంత‌మైన ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని మ‌రో నేత, మాన‌కొండూరు ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాలకిష‌న్ సైతం గ‌తంలో ఈట‌ల మాదిరే వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో పైకి అంతా బాగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నా గులాబీ ద‌ళం లోలోప‌ల కేటీఆర్ నాయ‌క‌త్వంపై కాస్త వ్య‌తిరేక‌త ఉన్న‌ట్లుగానే క‌నిపిస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఆది నుంచి ఉద్య‌మంలో ఉన్న నాయ‌కులు రాజ‌కీయాల‌కు అతీతంగానే ఇలా మాట్లాడి ఉంటార‌ని మ‌రో వ‌ర్గం అంటోంది.

నోరు జారిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆపై క్షమాపణలు

ఆ సినిమా కోసం ప‌వ‌ర్ స్టార్ రెండు రోజుల పాటు ఏమీ తిన‌లేదు.

రూ. 4 కోట్ల గిఫ్టు ఇచ్చిన హీరోయిన్‌!

అంజీర పండ్లతో చక్కటి ఆరోగ్యం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -