Friday, March 29, 2024
- Advertisement -

‘101 జిల్లాల అందగాడు’ గా వస్తున్న శ్రీనివాస్ అవసరాల!

- Advertisement -

‘అష్టాచమ్మా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరో, విలన్ గా నటించాడు. అంతే కాదు కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇండస్ట్రీలో పలు రంగాల్లో తన సత్తా చాటుతున్న అవసరాల శ్రీనివాస్ తాజాగా ‘101 జిల్లాల అందగాడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దిల్ రాజు, క్రిష్ కలిసి సమర్పిస్తున్న ఈ సినిమాను శిరీష్, వై. రాజీవ్ రెడ్డి, జె. సాయిబాబు నిర్మిస్తున్నారు. తాజాగా ‘101 జిల్లాల అందగాడు’ మూవీ టీజర్ విడుదల కాబోతోంది.

దీనికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘బాలా’ చిత్రానికి ఇది రీమేక్ కాచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. యుక్త వయసులో బట్టతల వచ్చిన ఓ యువకుడికి సమాజంలో ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది.. అతని ప్రేమను ఎలా కష్టాల పాలైంది.. ప్రేమించిన అమ్మాయిని ఎలా సాధించుకున్నాడు అన్నదే సినిమా కథ.

గతంలో  అవసరాల శ్రీనివాస్ బాలీవుడ్ అడల్ట్ కామెడీ మూవీ ‘హంటర్’ తెలుగు రీమేక్ ‘బాబు బాగా బిజీ’లో హీరోగా నటించాడు. కానీ అది ఘోర పరాజయం పొందింది. కాగా, ‘100 జిల్లాల అందగాడు’ మూవీతో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది మే 7న విడుదల కాబోతోంది. 

ఆకట్టుకుంటున్న సంపూ ‘బజార్ రౌడీ’ టీజర్!

ఏపీలో విజృంభిస్తున్న కరోనా కేసులు!

నటుడు మాధవన్‌కు కరోనా పాజిటివ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -