Wednesday, April 24, 2024
- Advertisement -

అన్మాత్తే పై పుకార్లు నమ్మొద్దు

- Advertisement -

సిరుతై శివ దర్శకత్వంలో సూపర్​స్టార్​ రజనీకాంత్​ హీరోగా.. అన్మాత్తే అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తున్నాయి. ఈ చిత్రం స్టార్ట్​ చేశాక అన్నీ ఆటంకాలే ఎదురయ్యయ్యాయి. ముందుగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేయడం, ఆ తర్వాత అనారోగ్యం పాలై ఇంటికే పరిమితమవ్వడం వంటి కారణాలతో ఈ సినిమా షూటింగ్ డిలే అయ్యింది.

దీంతో ఈ మూవీ విడుదల ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ రాలేదు. చివరకు ఈ ఏడాది సెప్టెంబర్​ 4న విడుదల చేస్తామని నిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారు. దీపావళి కానుకగా రాబోతుందని ఫ్యాన్స్​ కూడా ఖుషీ అయ్యారు. అయితే తాజాగా ఈ చిత్రం విడుదలపై మళ్లీ పుకార్లు వ్యాపించాయి.

దీపావళికి రాకపోవచ్చని తమిళ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. ఈ చిత్ర షూటింగ్​ గతంలో వాయిదా పడింది. రజనీకాంత్​ రాజకీయాల్లోకి రావాలని గతంలో భావించారు. ఆ టైంలో కొంతకాలం వాయిందా పడింది. మరోవైపు రజనీకి ఆరోగ్యం సహకరించకపోవడంతో మరోసారి వాయిదా పడింది. ఈ సినిమాలో హీరోయిన్​గా నయనతార నటిస్తోంది. మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా అన్మాత్తే టీం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా అనుకున్న సమయానికి సెప్టెంబర్​ 4న విడుదల చేస్తామని మేకర్స్​ ప్రకటించారు.

Also Read

ఓ రేంజ్ లో అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్..!

20 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!

రెబల్ స్టార్ మూవీలో తొలిసారి సమంత..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -