ఆర్​ఆర్​ఆర్​ “దోస్తీ” వచ్చేసింది..!

- Advertisement -

భారీ బడ్జెట్​తో, పాన్​ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆర్​ఆర్​ఆర్​ అక్టోబర్​ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు భారీగా ప్రమోషన్​ చేసుకోవాలని మేకర్స్​ భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆర్​ఆర్​ఆర్​ నుంచి ‘దోస్తీ​’ పేరిట ఓ పాట విడుదలైంది. అన్ని భాషల్లోనూ ఈ పాట రిలీజ్​ కాగా.. తెలుగులో హేమచంద్ర ఆలపించారు. సీతారామశాస్త్రి లిరిక్స్​ రాశారు. ఈ పాట విన్న ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నిమిషాల్లోనే లక్షల వ్యూస్​ వచ్చేశాయి.

అయితే ప్రమోషనల్​ సాంగే ఇలా ఉంటే.. ఇక సినిమా ఏ రేంజ్​లో ఉంటుందో అని ఫ్యాన్స్​ ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) కోసం యావత్​ ప్రపంచం ఎదురుచూస్తున్నది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాల్పానిక చారిత్రక చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అల్లూరి సీతారామారాజుగా చరణ్.. కుమ్రం భీంగా తారక్​ నటిస్తున్న విషయం తెలిసిందే. పోస్టర్లు టీజర్లు అంచనాలను భారీగా పెంచాయి. ఇక మేకింగ్ వీడియో అయితే పిచ్చెక్కించింది.

- Advertisement -

ఇవాళ విడుదలైన ”దోస్తీ” పాట ప్రేక్షకులను మెస్మరైజ్​ చేస్తోంది. కీరవాణి స్వరపరిచిన మ్యూజిక్​ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. అనిరుధ్ రవిచంద్రన్ – అమిత్ త్రివేది – విజయ్ ఏసుదాసు – యాజిన్ నజీర్ వంటి ఐదుగురు ప్రముఖ సింగర్స్ ఈ సాంగ్ ను పాడారు.

Also Read

తగ్గేదెలా అంటున్న వెంకీ మామ..!

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

ప్రభాస్ వదిలుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -