రెబల్ స్టార్ మూవీలో తొలిసారి సమంత..!

- Advertisement -

ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకుంది. తెలుగు టాప్ హీరోలు, యువ హీరోలు అందరితో సినిమాల్లో నటించింది. అయితే ప్రభాస్ సినిమాలో మాత్రం సమంత ఇప్పటివరకు నటించలేదు. సమంత కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ప్రభాస్ బాహుబలి సినిమాకు ఐదేళ్ల కేటాయించడం, సాహో కోసం రెండేళ్లు, రాధే శ్యామ్ మూవీ కోసం ఇంకో రెండేళ్ళు వెచ్చించడం తో ఆయన ఎక్కువ సినిమాల్లో నటించలేదు. అందువల్లే సమంతకు ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ దొరకలేదు.

అయితే తొలిసారి సమంత ప్రభాస్ సినిమాలో నటించనుంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ అయి విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఆయన సలార్, ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.

అయితే మరో కీలక పాత్ర కోసం మేకర్స్ సమంతను సంప్రదించినట్లు సమాచారం. తన పాత్ర నచ్చడంతో సమంత కూడా ఈ సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే సమంతా ఇందులో నటించేది హీరోయిన్ గానా లేక కీలక పాత్రలోనా అన్నది తెలియాల్సి ఉంది. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది.

Also Read

చరణ్​- శంకర్​ సినిమాలో హీరోయిన్​గా లక్కీబ్యూటీ..!

నేను సుమతో విడిపోలేదు.. కొంతకాలం విడిగా ఉన్నా.. కారణం ఏమిటంటే?

లూసిఫర్ రీమేక్ కి అంతా సిద్ధం.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -