ఓటీటీలో ఈ వారం వస్తున్న సినిమాలు ఇవే

- Advertisement -

థియేటర్లు లేని లోటును ఓటీటీ కొంతవరకైనా తీర్చగలుగుతోంది. ముఖ్యంగా కరోనా లాక్​డౌన్​లో చాలా మంది ఓటీటీలవైపు మొగ్గు చూపుతున్నారు. నామ మాత్రపు చార్జీలతో కొత్త సినిమాలు వీక్షించే అవకాశం ఉండటంతో అందరూ ఓటీటీకే ఓటేస్తున్నారు. ఇక ఈ డిజిటల్​ ఫ్లాట్​ఫాం పుణ్యమా అని చాలా మంది కొత్త దర్శకులు, కొత్త రచయితలు, కొత్త సబ్జెక్టులు, కొత్త నటీనటులు తెరమీదకు వస్తున్నారు. ఓటీటీలో అశ్లీలత, హింస ఎక్కువగా ఉంటుందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ .. ప్రేక్షకులు మాత్రమే వీటితో బాగానే కనెక్ట్ అయ్యారు.

తెలుగు లో తొలిసారిగా వచ్చిన ఆహా ఓటీటీ అనతి కాలంలోనే ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. మలయాళ, తమిళ చిత్రాలలోని కొన్ని విభిన్నమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఇక అమెజాన్​, నెట్​ఫ్లిక్స్​ వంటి సంస్థలు ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి. ఇదిలా ఉంటే ఈ వారం ఓటీటీ ద్వారా ఎటువంటి సినిమాలు విడుదల కాబోతున్నాయో? వాటి విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..

- Advertisement -

Also Read: రీ ఎంట్రీలో కలర్స్​ స్వాతి దూకుడు..!

విక్రమార్కుడు.. తమిళంలో విడుదలైన ‘జుంగా’ అనే చిత్రాన్ని తెలుగులో ‘విక్రమార్కుడు’ పేరుతో ఆహా యాప్​లో విడుదల చేయబోతున్నారు. సాయోషా, మడోన్నా సెబాస్టియన్ నటీనటులు. గోకుల్ ఈ చిత్రానికి డైరెక్టర్​. విజయ్ సేతుపతి, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. జూలై 8న ఈ మూవీ స్ట్రీమింగ్​ కాబోతున్నది. యాక్షన్​, కామెడీ జోనర్​లో తెరకెక్కిన సినిమా ఇది.

సారాస్… అన్నాబెన్ నటించిన మలయాళ చిత్రం “సారాస్”. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటికే విడుదలైంది. జూడ్ ఆంథోని జోసెఫ్ ఈచిత్రానికి దర్శకుడు ‘కప్పెలా’, ‘హెలెన్‌’ లాంటి హిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అన్నాబెన్‌ నటించిన ‘సారాస్‌’పై అంచనాలు పెరిగాయి. పెళ్లి, పిల్లలు అంటే ఓ యువతికి అస్సలు ఇష్టం ఉండదు. పైగా ఆమె సినిమా దర్శకురాలు అవ్వాలని కలలు గంటుంది. అటువంటి ఆ యువతి జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైంది అన్నదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.

Also Read: ఆరు నెలల్లో నాలుగు బ్లాక్ బస్టర్లు..!

స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్…. బాలీవుడ్ నటుడు అక్షన్ ఖన్నా ‘స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్’ చిత్రంతో డిజిటల్ అరంగేట్రం చేయబోతున్నాడు. గుజరాత్ లోని అక్షరధామ్ ఆలయంపై జరిగిన తీవ్రవాదుల దాడి ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 9న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

ఒక చిన్న విరామం.. పునర్నవి భూపాలం బిగ్​బాస్ తో ఫేమస్​ అయ్యింది. ఆమె అందానికి కుర్రాళ్లు మతి పోగొట్టుకుంటారు. బిగ్​బాస్​ తర్వాత రాహుల్​ సిప్ల్​గంజ్​తో ప్రేమ వ్యవహారం ఇలా తరచూ వార్తల్లో నిలిచింది. పునర్నవి కీలక పాత్రలో నటించిన చిత్రం ఓ చిన్న విరామం. థ్రిల్లర్​గా ఓ మూవీ తెరకెక్కింది. జూలై 9న ఆహాలో విడుదల కానున్నది.

వీటితోపాటు..

జీ5లో..
చతుర్ముఖం (జులై 9),
క్రష్‌ జులై 9,
లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌(జులై 9)

నెట్‌ఫ్లిక్స్‌లో..
హిడెన్‌ స్ట్‌ ఆఫ్‌ గుజరాత్‌ (జులై 9)
ఐ థింక్‌ యు షుడ్‌ లీవ్‌ విత్‌ టిమ్‌ రాబిన్సన్‌ (జులై 6)
ది వార్‌ నెక్స్ట్‌ డోర్‌(జులై 7)
క్రాల్‌ (జులై 11)
డోరా అండ్‌ ది లాస్ట్‌ సిటీ ఆఫ్‌ గోల్డ్‌ (జులై 11)
రెసిడెంట్‌ ఈవిల్‌: ఇన్ఫెనిట్‌ డార్క్‌నెస్‌ (జులై 8)
ఆప్టికల్‌: సీజన్‌ 4(జులై 9)
వర్జిన్‌ రివర్‌: సీజన్‌ 3 జులై 9
హౌ ఐ బికమ్‌ ఏ సూపర్‌ హీరో (జులై 9)

బుక్‌ మై షో స్ట్రీమ్‌
వేలుక్కక్క ఒప్పు కా (జులై 6)
వన్‌ ఫర్‌ ఆల్‌ (జులై 9)

Also Read: ఆ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టిన బేబమ్మ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -