Wednesday, April 24, 2024
- Advertisement -

ఆచార్య క్రేజీ అప్‌డేట్‌..సిద్ధ వచ్చేశాడు.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సెట్స్‌లో రామ్‌చరణ్‌ అడుగు పెట్టారట. నేటి నుంచి రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు కొరటాల.

ఈ సందర్భంగా చెర్రికి స్వాగతం పలుకుతూ ‘మా సిద్ధ సర్వం సిద్ధం’అంటూ రామ్ చరణ్ లుక్‌లు రివీల్ చేశాడు దర్శకుడు కొరటాల శివ.మెడలో రుద్రాక్షలతో చెవి పోగు పెట్టుకుని ఆలయంలోకి అడుగుపెడుతున్నట్టుగా ఉన్న ఈ లుక్‌లో రామ్ చరణ్ ఫేస్‌ని రివీల్ చేయలేదుకానీ.. అతని పాత్ర ఎలా ఉండబోతుందనే దానికి హింట్ ఇస్తూ పోస్టర్ విడుదల చేశారు.

ఆచార్య’లో రామ్ చరణ్ అతిథి పాత్ర కాకుండా.. పూర్తి స్థాయిలో నటించబోతున్నట్టు సమాచారం. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రామ్ చరణ్ పాత్ర ఈ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఇందులో రామ్ చరణ్ ‘సిద్ధ’అనే నక్సలైట్ పాత్రను చేయనున్నట్టు సమాచారం. అయితే తాజాగా విడుదలైన సిద్ధ లుక్ చూస్తే.. నక్సలైట్ పాత్రకి ఈ క్యాస్టూమ్‌కి సంబంధం లేదనట్లుగా కనిపిస్తోంది. సర్వం సిద్ధం అంటూ వచ్చిన ఈ ‘సిద్ధ’‘ఆచార్య’కి ఎలా సపోర్ట్‌గా నిలుస్తాడో చూడాలి మరి. కాగా, కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను తేజ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://twitter.com/sivakoratala/status/1350661983444471809

షియాజీ షిండే సినిమాల్లోకి రాకముందు ఏం పని చేశేవారో తెలుసా ?

టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా ?

టాలీవుడ్ హీరోల ఆస్తుల విలువ ఎంతనో తెలుసా ?

ఎన్టీఆర్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -