Friday, March 29, 2024
- Advertisement -

దేశంలో కొత్త రైళ్లు.. కానీ మొత్తం ఆ రాష్ట్రంలోనే..!

- Advertisement -

గుజరాత్‌లో ఐక్యతా విగ్రహం ఉన్న కేవడియా ప్రాంతాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలతో కలిపే 8 రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11గంటలకు ప్రారంభించనున్నారు. దీనితోపాటు గుజరాత్‌లోని పలు రైల్వే ప్రాజెక్టులను కూడా మోదీ ప్రారంభిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. బ్రాడ్‌గేజ్‌ మార్గం సహా దాబోయ్‌, చందోడ్‌, కేవాడియాల్లో రైల్వే స్టేషన్‌ భవనాలను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

పలు గిరిజన ప్రాంతాలకు, నర్మదా నది తీరంలో ఉన్న దర్శనీయ స్థలాలకు రవాణా సౌకర్యం కల్గించేలా ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని పీఎంఓ తెలిపింది.

ఈ నేపథ్యంలో తాను ప్రారంభించబోయే జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు ఫొటోలను ప్రధాని మోదీ ట్విట్టర్​ వేదికగా షేర్‌ చేశారు. ‘అహ్మదాబాద్‌ నుంచి కెవడియా మధ్య ఆదివారం ప్రారంభించబోయే రైళ్లలో జన్‌శతాబ్ది రైలు ఒకటి. దీంట్లో విస్టాడోమ్‌ కోచ్‌లు ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -