Friday, May 3, 2024
- Advertisement -

పవన్ బస్సు యాత్రతో.. వైసీపీకి భయం పట్టుకుందా ?

- Advertisement -

ఈ మద్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న వైసీపీ నేతలు చాలా వేగంగా రెస్పాండ్ అవుతున్నారు. ఎంతలా రెస్పాండ్ అవుతున్నారంటే.. రాష్ట్రంలో ఇంకేమి సమస్యలే లేవన్నట్లుగా కేవలం పవన్ నే టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. విశాఖ ఘటన మొదలుకొని ఇటీవల చోటు చేసుకున్నా ఇప్పటం గ్రామ పరిణామాల వరకు జనసేన వర్సస్ వైసీపీ మద్య చోటు చేసుకున్నా పోలిటికల్ వార్ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతటి ప్రకంపనలు సృష్టించాయో అందరం చూశాం. ఇక తాజాగా జనసేన అధినేత తన ప్రచారరథం వారాహి ని సిద్దం చేసుకోవడంపై కూడా వైసీపీ నేతలు పని కట్టుకొని విమర్శలు చేస్తున్నారు. .

అసలు పవన్ వారాహి కి నిషేదమైన ఆలివ్ గ్రీన్ రంగు ను వాడారని పవన్ రూల్స్ అతిక్రమించరాని ఇలా చాలా రకాలుగా విమర్శలు గుప్పించారు. తీర వారాహిపై అధికారులకు కూడా డౌట్ వచ్చి రిజిస్ట్రేషన్ ప్రసస్ ను హోల్డ్ లో పెట్టేంతలా నానా హైరానా చేశారు వైసీపీ నేతలు. ఇక తాజాగా పవన్ ప్రచార రథం అన్నీ అడ్డంకులు దాటుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే పవన్ రాష్ట్రమంతా కూడా బస్సు యాత్ర చేపట్టనున్నారు. అయితే పవన్ చేపట్టబోయే ఈ యాత్ర వల్ల వైసీపీలో గుబులు మొదలైందా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటివరకు పవన్ చేపట్టిన ” జనవాణి, రైతు భరోసా యాత్ర.. :” వంటి వాటికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అంతే కాకుండా జనసేన కు కూడా మంచి మైలేజ్ తీసుకొచ్చాయి. దాంతో ప్రస్తుతం జనసేనపై ప్రజల్లో సానుకూలత మెండుగానే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ బస్సు యాత్ర చేపడితే జనసేన పార్టీ ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇది వైసీపీకి మింగుడు పడని విషయమనే చెప్పాలి. ఒకవేళ పవన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తే అది వచ్చే ఎన్నికల్లో జనసేనకు మంచి మైలేజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే పవన్ బస్సు యాత్రపై వైసీపీలో కలవరం మొదలైందనే వాదనలు వినిపిస్తున్నాయి. 175 స్థానాల్లో విజయమే టార్గెట్ గా పెట్టుకున్న వైసీపీకి జనసేన ప్రభావం పెరిగితే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని, అందుకే పవన్ యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న హాట్ హాట్ డిబేట్. మరి పవన్ యాత్రపై మొదట్లోనే రాజకీయాలు ఈ స్థాయిలో వేడెక్కితే.. ఇక యాత్ర చేపట్టిన తరువాత ఏపీ పోలిటిక్స్ మరింత వేడెక్కడం ఖాయమనే చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

పొత్తులపై జనసేన క్లారిటీ.. త్వరలోనే అన్నీ వివరాలు !

వన్స్ మోర్ జగన్.. 2024 ?

మళ్ళీ కవితకు నోటీసులా.. అసలేం జరుగుతోంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -