Thursday, April 25, 2024
- Advertisement -

RC15: ఆర్​సీ 15పై అదిరిపోయే అప్​డేట్​..!

- Advertisement -

మెగా పవర్​ స్టార్​ రాంచరణ్​ తన 15 చిత్రంగా ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్​లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అప్​డేట్ కోసం ఫ్యాన్స్​ పిచ్చి పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. స్టార్​ డైరెక్టర్​ శంకర్​ తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి చర్చించేందుకు చెర్రీ, దిల్​రాజు చెన్నై వెళ్లారు. వారికి శంకర్​ తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ పిక్​ను చెర్రీలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆర్​సీ 15 కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెర్రీ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే శంకర్​ ఇండియన్​ 2 మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. నిర్మాణ సంస్థ లైకాతో గొడవ కారణంగా ఈ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. ఇక హీరో కమల్​ హాసన్​, డైరెక్టర్​ శంకర్​ మాత్రమే ఇండియన్​ 2ను పక్కకు పెట్టి వేరే ప్రాజెక్టులకు కమిట్​ అయ్యారు. ఇదిలా ఉంటే లైకా సంస్థ కోర్టుకకెళ్ళింది. ప్రస్తుతం ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ మూవీ షూటింగ్​ తొందరగా పూర్తిచేసుకొని.. లేదంటే ఆ లోపే ఆర్​సీ 15 ప్రారంభించే చాన్స్​ ఉంది.

Also Read: మాస్​ డైరెక్టర్​తో విజయ్​ దేవరకొండ మూవీ?

ప్రస్తుతం చెర్రీ రాజమౌళి దర్శకత్వంలో ఆర్​ఆర్​ఆర్​, చిరంజీవి ఆచార్యలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన వెంబడే.. శంకర్​ సినిమా షెడ్యూల్​ ప్రారంభించే చాన్స్​ ఉంది. ఈ సినిమా పాన్​ ఇండియా లెవెల్​లో భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారు.

Also Read: ఒక్క సినిమా హిట్ కొట్టు.. నాని సినిమా పట్టు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -