రాత్రి పడుకునే ముందు అలా చేయకండి..!

రాత్రి సయంలో ఎలాంటి విరామం లేకుండా.. చక్కగా.. ప్రశాంతంగా 7-8 గంటల నిద్రపోవాలని అందరికి ఉంటుంది. ప్రశాంతంగా 7-8 గంటల మనిషి నిద్రపోవడం శరీరానికి కూడా చాలా అవసరం. కాని కొందరు ఆహారపు అలవాట్లతో నిద్ర చెడగొట్టుకుంటారు. బహుశా, నిద్రలోకి జారుకోవడానికి సహాయపడే ఆహారం ఏదో, నిద్రను చెడగొట్టే ఆహారం ఏదో అవగాహన లేకపోవడం వలనేమో. అందుకే నిద్రకి ముందు ఏ ఆహారం తినాలో, ఏం తినకూడదో చూద్దాం.

రాత్రిపూట లైట్ ఆహారం తీసుకోవడమే మంచిది. Dine Like A Beggar అనే సామెత వినే ఉంటారు. కాబట్టి స్పైసీ, హెవీ ఆహారం వద్దు. ఆసిడ్ రిఫ్లక్స్ సమస్యతో నిద్ర చెడిపోవచ్చు.

Also Read: భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

  • కాఫీ మెదడుని ఉత్తేజపరచడానికి పనిచేస్తుంది. దీన్ని ఉదయంపూట, వర్కింగ్ అవర్స్ లో తీసుకోవాలి. విశ్రాంతి తీసుకునేటప్పుడు కాదు.
  • ఆల్కహాల్ తాగడం, నీళ్ళు అతిగా తాగడం కూడా నిద్రకి ముందు చేయకూడని పనులు. మధ్యలో మూత్రవిసర్జన కోసం నిద్ర లేవాల్సి వస్తుంది.
  • చెర్రిల్లో నిద్రకు ఉపయోగపడే మెలాటోనిన్ ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ట్రై చేయండి.
  • అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం ఉండటం వలన ఇది రిలాక్సేషన్ కి ఉపయోగపడుతుంది.
  • స్వీట్ పొటాటోలో కూడా పొటాషియం ఉంటుంది. ఇది కూడా అరటిపండు లాగే నిద్రకి ఉపయోగపడుతుంది.

Also Read: ప్యాకెట్ పాలు తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

Related Articles

Most Populer

Recent Posts