Thursday, May 2, 2024
- Advertisement -

మరొక ఆరెంజ్ తీస్తా అంటున్న రామ్ చరణ్

- Advertisement -

రామ్ చరణ్ తో ఒక లవ్ స్టోరీ తీస్తే ఎలా ఉంటుంది అని అప్పట్లో బొమ్మరిల్లు భాస్కర్ అనుకోబట్టి ఆరెంజ్ లాంటి భారీ డిజాస్టర్ వచ్చింది. సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయినా కూడా రామ్ చరణ్ కి , ఆ కథ కి మాత్రం క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఒచ్చింది.

ఆ తరవాత నుంచీ మాస్ మసాలా రూట్ లో వెళ్ళిపోయిన హీరో చరణ్ అదే టైపు లో సినిమాలు చేస్తున్నాడు. పూర్తి లవ్ స్టోరీ మీద చరణ్ అసలు ద్రుష్టి కూడా పెట్టడం లేదు. శర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా తీసిన మేర్లపాక గాంధీతో.. రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం సురేందర్ రెడ్డితో ధృవ చేస్తున్న చెర్రీ.. నవంబర్ నుంచి సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండింటి తర్వాత వరుసగా రెండు లవ్ స్టోరీలు చేయాలని అనుకుంటున్నాడట చరణ్. వీటిలో ఒకటి మేర్లపాక గాంధీతో చేయనున్నాడని.. ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే అయిపోగా.. కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.

Related

  1. రామ్ చరణ్ ధృవ రిలీజ్ డేట్!
  2. రామ్ చరణ్ కి అడ్డం పడుతున్న చిరంజీవి
  3. బాబాయ్ తో కలిసి రామ్ చరణ్!
  4. రామ్ చరణ్ కావాలనే బన్నీని అవాయిడ్ చేసాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -