Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కాస్త బుద్ది తెచ్చుకో

- Advertisement -

స్పెషల్ స్టేటస్ విషయం లో తాను చెయ్యగలిగేది ఏదీ లేదు అన్నట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడ్డం విశేషం. నిన్న మీడియా ఇంటరాక్షన్ అప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడడం అన్నాడు తప్ప అస్సలు సీరియస్ గా   ఉన్నట్టు కనపడలేదు పవర్ స్టారుడు .

అయితే పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు స్వయంగా కట్టడి చేస్తున్నాడు అనే న్యూస్ ఎక్కడ చూసినా ప్రచారం లో ఉంది.  బాబు చెప్పబట్టే కళ్యాణ్ అలా స్టేటస్ గురింఛి ఎలాంటి సీరియస్ కామెంటూ చెయ్యడం లేదు అన్ని వాదన నడుస్తోంది, మరొక పక్క హీరో శివాజీ ఇప్పుడు రాజ్యాంగ బద్ధంగా స్పెషల్ స్టేటస్ కోరే పనిలో పడ్డారు.

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల సభల్లో టీడీపీ-బీజేపీ ఇచ్చిన హామీలను నమ్మి ఓటు వేసిన జనం నిండా మోసపోయారని పిల్ లో శివాజి పేర్కొన్నారు.  ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు పునర్విభజన చట్టంలోని హామీలను సక్రమంగా అమలు జరిగేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్ లో కోరారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కానీ ఈ హామీని నిలుపుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైపల్యం చెందిందని శివాజి ఆక్షేపించారు.

అందుకే తగు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి – నీతి ఆయోగ్ కార్యదర్శి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా చేశారు. ఈ కేసు ఈనెల 22న విచారణ కొచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కంటే శివాజీ నే బెటర్ అని శివాజీ ని చూసినా స్పెషల్ స్టేటస్ విషయం లో పవన్ కాస్త బుద్ధి తెచ్చుకోవాలని అంటున్నారు విశ్లేషకులు.

Related

  1. పవన్ కొడుకు ఆ సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడు!
  2. పవన్‌ కు మరీ ఇంత ఎందుకు?
  3. షాకింగ్ : పుష్కరాల్లో చంద్రబాబు కి పిండ ప్రధానం
  4. నా కులం తో నాకు సంబంధం లేదు – హీరో శివాజీ
  5. చంద్రబాబు కి ఒళ్ళు మండే మాట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -