Friday, April 26, 2024
- Advertisement -

రామ్ చరణ్, శంకర్ సినిమా కథ ఎలా ఉండబోతుందంటే..?

- Advertisement -

కేవలం సౌత్ మాత్రమే కాదు.. పాన్ ఇండియన్ రేంజ్ లో ఇప్పుడు శంకర్, రామ్ చరణ్ సినిమా గురించి చర్చ జరుగుతుంది. రెండు భిన్న ధృవాలు ఈ సినిమాతో కలిసి పనిచేయబోతున్నాయి అందుకే అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. 30 ఏళ్లుగా తెలుగు సినిమా వైపు చూడని ఈ దర్శకుడు ఇప్పుడు స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు. దీనికోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేస్తున్నాడు శంకర్. ఇప్పటికే చెప్పిన లైన్ కూడా నచ్చడంతో నిర్మాత దిల్ రాజు ఓకే చెప్పేసాడు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తోనే ఈ సినిమా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే సాధారణంగా శంకర్ సినిమా అంటే కచ్చితంగా విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఇంకా చాలా కథలు ఉంటాయి. అవన్నీ పూర్తయ్యే సరికి కచ్చితంగా రెండు మూడేళ్లు పడుతుంది.

అందుకే గత పదేళ్ళలో ఈయన నుంచి మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి. తాజాగా రామ్ చరణ్ సినిమాను కూడా రెండు మూడేళ్లు చేస్తాడని ఇప్పటికే ఈ సినిమా గురించి అభిమానులు చర్చ మొదలు పెట్టారు. కానీ ఈ సారి మాత్రం అలా ఉండదంటున్నాడు శంకర్. తనతో సినిమా అంటే కచ్చితంగా రెండు మూడేళ్లు అవుతుందని అంతా ఫిక్స్ అవుతారు కానీ రామ్ చరణ్ సినిమాను మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేస్తానంటున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ కానీ..స్పెషల్ సీన్స్ కానీ ఉండవంటున్నాడు ఈ దర్శకుడు. కేవలం కథతోనే ఈ సినిమా ముందుకు వెళ్తుంది కానీ టెక్నికల్ బేస్ మీద కాదంటున్నాడు ఈ దర్శకుడు.

రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమా ఉండబోతుంది. ఇప్పటికే అదిరిపోయే లైన్ సిద్ధం చేసి.. దాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు శంకర్. ఒక్కసారి ఫైనల్ నెరేషన్ అయిపోతే షూటింగ్ కు వెళ్లడమే తరువాయి అంటున్నాడు ఈ దర్శకుడు. దిల్ రాజు కూడా ఈ నెరేషన్ కోసమే చూస్తున్నాడు. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. 2022 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

పోర్న్ సెర్చ్ చేస్తున్నారా? ఇక మీ ప‌ని అయిపోయిన‌ట్లే..!

పండ్లు ఎప్పుడు తినాలి?

అభిమానులు ప్రేమకు పొంగిపోతున్న నిధి అగర్వాల్

ఈ రుచి మాములుగా ఉండ‌దు.. క్యూ క‌ట్టాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -