Tuesday, May 14, 2024
- Advertisement -

డైరెక్టర్ ను తిట్టి సెట్స్ నుంచి వెళ్లిపోయిన పవన్! ఏం జరిగింది?

- Advertisement -
pawan gets angry and walked away from sets

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ టాలీవుడ్ టాప్ హీరో అనవసరపు విషయాల్లో అసలు జోక్యం చేసుకోరు. తిక్క పుట్టిందంటే ఎంతటి వారినైనా ఎదుర్కొంటారు. అలాగే అతని అభిమానులు భాదలో ఉన్న తట్టుకోలేడు. ఏదైన ఉంటే మొహం మీదే అడిగేస్తారు. ఈ తత్వం పవన్ కు చిన్నప్పటి నుంచే ఉంది. ఈ మధ్య జనసేన పార్టీకి అధినేత కావడంతో ఆచితూచి మాట్లాడుతున్నారు. సహనం, సంయమనం పాటిస్తున్నారు.

అలా చాలా మారిన పవన్ కళ్యాణ్ కి కాటమరాయుడు చిత్ర బృందం కోపం తెప్పించింది. డాలీ డైరెక్షన్లో.. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సికింద్రాబాద్ లో వేసిన భారీ సెట్ లో జరుగుతోంది. సోమవారం షూటింగ్ కి హాజరైన పవర్ స్టార్ కి ఆరోజు యాక్షన్, డైలాగ్ పేపర్ ని డైరక్టర్ టీమ్ అందించలేదు.

మధ్యాహ్నం అవుతున్నా షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో కోపంతో సెట్స్ లోకి వచ్చిన పవన్ ఆగ్రహంతో డైరక్టర్ పై అరిచారు. ఈరోజు సీన్ ఏమిటి, అందులో నటించే వారెవరు వాటన్నింటినీ సరిగ్గా ప్లాన్ చేయకుండా సమయాన్ని వృథా చేశారని డాలీపై ఆవేశంగా మాట్లాడి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేసి మరో రెండు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని పవన్ భావిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 29 న రిలీజ్ అవుతుందని ప్రకటించారు కూడా. ఇలాంటి సమయంలో డైరక్టర్ చురుకుగా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ ఆవేశపడ్డారని ఆయన సన్నిహితులు చెప్పారు.

{youtube}yG5Hy8NuHyk{/youtube}

Related

  1. పవన్ దెబ్బకి షాక్ లో ఉన్న మ‌హేష్‌ బాబు!
  2. పవన్ ను నయనతార అంత మాట అనేసిందా?
  3. రామ్ చరణ్ కోసం పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
  4. పవన్ సీక్రెట్ ని శృతి బయటకి చెప్పేసిందిట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -