Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ దెబ్బకి షాక్ లో ఉన్న మ‌హేష్‌ బాబు!

- Advertisement -
mahesh confused with pawan desicion

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి, సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ ఇద్దరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. ఇక సినిమా సూపర్ హిట్ అయితే కలక్షన్లు ఊహించని రెంజ్ లో వస్తాయి. అందుకే వీలైనంత వరకు ఈ ఇద్దరి సినిమాలు ఒకేసారి రాకుండా చూసుకుంటారు నిర్మాతలు. అయితే ప్రస్తుతం పవన్ నటిస్తున్న కాట‌మ‌రాయుడు సినిమా విడుదల తేదిని ఎనౌన్స్ చేశారు.

ఈ ఎనౌన్స్ రాగానే వెంట‌నే ప్రిన్స్ మ‌హేష్‌బాబు అయోమ‌యంలో ప‌డ్డాడ‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ సినిమా రిలీజ్ డేట్‌కు మ‌హేష్ అయోమ‌యానికి కార‌ణం ఏంటంటే మహేష్ – మురుగదాస్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా (వ‌ర్కింగ్ టైటిల్ ఏజెంట్ శివ‌)ను మార్చి నెలాఖ‌ర్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘బాహుబలి 2’ ఏప్రిల్ నెలాఖర్లో రానుండడంతో ఆ సినిమాకు నెల రోజుల ముందొస్తే బాగుంటుందని ఈ చిత్ర నిర్మాత‌లు భావించారు.

అయితే ఇప్పుడు కాట‌మ‌రాయుడు సినిమాను మార్చి 29న రిలీజ్ చేస్తామ‌ని ఎనౌన్స్ చేయ‌డంతో మ‌హేష్ నిర్మాత‌ల ప్లాన్ మొత్తం రివ‌ర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్, మే నెలలు కాటమరాయుడు – బాహుబలి 2 సినిమాలతోనే నిండిపోనున్నాయి. దీంతో మహేష్ సినిమా వస్తే.. మే తర్వాతే రావాల్సి ఉంటుంది. దీంతో వేసవిలో మహేష్ సినిమా రిలీజ్ అయ్యే చాన్స్ లు చాలా తక్కువే. దీంతో మహేష్ నిర్మాతలు ఏం చేయాలో అర్ధంకాక టెన్షన్ లో ఉన్నారట.

Related

  1. పవన్ ను నయనతార అంత మాట అనేసిందా?
  2. రామ్ చరణ్ కోసం పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
  3. సుధీర్‌తో ఎఫైర్‌ గురించి ర‌ష్మీ ఏమంటుందంటే?
  4. ల‌వ్ గురించి నిజాలు చెప్పిన త‌మ‌న్నా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -