Thursday, April 25, 2024
- Advertisement -

కిడ్నాప్ చేసిన ఎస్ఐను హత్య చేసిన మావోయిస్టులు

- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు మారణ కాండ సృష్టిస్తూనే ఉన్నారు. ఈ మద్యనే బీజాపూర్‌లో 22 మందికి పైగా పోలీసులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా బీజాపూర్‌ జిల్లాలోని జగదల్పూర్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళి తాతిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ నెల 21న చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలనార్ గ్రామంలో ఎస్సై తాటి మురళిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.

మూడు రోజులపాటు తమ చెరలో ఉంచుకున్న మావోలు తాాజాగా మురళిని హత్యచేసి పుల్సుమ్ పారా వద్ద రోడ్డుపై పడేశారు. ఈ సందర్భంగా పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో ఓ లేఖను మావోలు వదిలివెళ్లారు. గంగలూర్‌లో ఎస్ఐగా పని చేస్తున్న మురళి సెలవుల కోసం ఇంటికి వెళ్లారు.

ఈ క్రమంలో బీజాపూర్‌ జిల్లాలోని తన గ్రామం పల్నూర్‌ గ్రిహగ్రామ్ నుంచి గత బుధవారం మాయిస్టులు కిడ్నాప్ చేశారు. మురళి తాతి హత్యను ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధ్రువీకరించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇలాంటి దారుణం జరగడంతో చర్చనీయాంశంగా మారింది. కాగా, మురళి తాతి 2018లో జగదల్‌పూర్‌లో జాయిన్ అయ్యారు. అంతకుముందు ఆయన బీజాపూర్‌లో పనిచేశారు.

కరోనాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్

తీన్మార్ మల్లనపై కేసు నమోదు.. కారణం అదేనా?

మళ్ళీ ప్రేమలో పడిన గోవా బ్యూటీ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -