Thursday, May 16, 2024
- Advertisement -

బాబాయ్ బర్త్‌డే నాడు చెర్రీ ట్రీట్!

- Advertisement -

గతకొంత కాలంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు సరైన హిట్ లేదు. చేసిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫిస్ వద్ద ప్లాప్ కావడంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తన తాజా చిత్రం ‘ధృవ’ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన  ‘తని ఒరువన్’ సినిమాని తెలుగులో రిమేక్ చేస్తున్నాడు రామ్ చరణ్‌.

ఇక ఈ చిత్రంలో చెర్రీ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్ గా ఉంటుందట. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను బాబాయ్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే నాడు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. చాలాసార్లు చరణ్ సెంటిమెంట్‌లను ఫాలో అయ్యాడు. కొన్ని సినిమాల ఫస్ట్‌లుక్‌లు, టీజర్‌లు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశాడు.

ఈ సారి బాబాయ్ బర్త్‌డే రోజున తన సెంటిమెంట్‌ను ఫాలో కావాలని చూస్తున్నాడు. పవర్ స్టార్ తో ఓ సినిమా చేస్తానని గతంలో చెర్రీ చెప్పిన విషయం తెల్సిందే. ఏదేమైనా తన సెంటిమెంట్‌ను నమ్ముకున్న రామ్ చరణ్ మరి అనుకున్నట్లుగా ధృవ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను పవర్ స్టార్ బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తాడా లేడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Related

  1. ఇండైరెక్ట్ గా సహాయం చేసిన పవర్ స్టార్!
  2. పవర్ స్టార్ ఫ్యాన్స్ vs స్టైలీష్ స్టార్ ఫ్యాన్స్
  3. చెర్రీ డాక్టర్ కావాలి అంటే ఏడాది ఆగాలి!
  4. నా ఇన్స్పిరేషన్ బాబాయ్ అంటున్న చెర్రీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -