యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా జనతా గ్యారేజ్. మొదటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రంజాన్ సందర్భంగా రిలీజ్ చేశారు. ఇక టీజర్ అభిమానులు ఏవిధంగా ఊహించుకున్నారో ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా అదరగొట్టేశాడు యంగ్ టైగర్.
ఈ టీజర్ చూసిన అభిమానులు ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతోంది అని అంటున్నారు. కొరటాల శివ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. బలహీనుడైన వాడికి బలంగా జనతా గ్యారేజ్ ఉంటుందని తారక్ చెప్పే డైలాగ్ కేక పెట్టిస్తుంది. అందుకే ఈ ఈ టీజర్ యూట్యూబ్ లో 6 గంటల్లోనే 1 మిలియన్ వ్యూయర్స్ తో సంచలనంగా మారింది.
ఇక టీజర్ తోనే రికార్డులు షురూ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరియర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలవనుందట. ఇక తుది దశకు చేరుకున్న షూటింగ్ త్వరలో ముగించుకుని ఆడియోను జూలై 22న, సినిమాను ఆగష్టు 12న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి జూనియర్ టీజర్ తో చేస్తున్న ఈ సంచలనం ఎక్కడికెళ్ళి ఆగుతుందో చూడాలి.
{youtube}v=q6voJ13asIo{/youtube}
Related
