Sunday, April 28, 2024
- Advertisement -

ఇండైరెక్ట్ గా సహాయం చేసిన పవర్ స్టార్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాకి పని చేసిన ఓ దర్శకుడుకి సహాయం చేశాడని అంటున్నారు. అసలు ఏ దర్శకుడికి చేసాడో అంటే? గతంలో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాని తీసిన దర్శకుడు హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ సహాయం చేసాడు అని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ భారీ హిట్ అయిన తర్వాత హరీష్ శంకర్ కి ఎన్టీఆర్ తో రామయ్యా వస్తావయ్యా చేసే అవకాశం వచ్చింది.

ఎన్టీఆర్ తో చేసిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత హరీష్ శంకర్ కు కెరీర్ పరంగానూ, ఫైనాన్షియల్ గానూ కష్టం వచ్చిందట. ఆ తర్వాత చాలా టైం తీసుకొని సాయి ధరమ్ తేజతో సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే చిత్రం చేసాడు. ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సొంతం చేసుకుంది. అయిన కానీ హరీష్ మంచి ఆఫర్స్ ఎలాంటివి రాలేదు. అయితే గబ్బర్ సింగ్ మంచి హిట్ అయినప్పటికి ఆ సక్సెస్ పవన్ కళ్యాణ్ ఖాతాలో పడిపొయింది.

కానీ హరీష్ ను గుర్తించలేదు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. హరీష్ గురించి టాలీవుడ్ హీరోలకి సజెస్ట్ చేశాడంట. అందులో ఒకరు అల్లుఅర్జున్. సరైనోడు చిత్రం విజయం తర్వాత అల్లు అర్జున్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేయడానికి కారణం ఇదే అని అంటున్నారు. దీనికి నిర్మాత గా దిల్‌రాజు ఉండనున్నారు. అయితే పవర్ స్టార్ తనకి ఇంత మంచి సహాయం చేస్తున్న విషయం తెలుసుకున్న హరీష్ శంకర్ చాలా సంతోషంగా ఉన్నాడట.

Related 

  1. అన్నయ్య కోసం పవన్ ఎంత చేస్తున్నాడో తెలుసా?
  2. పవన్ మంచితనం గురించి అతని గురువు ఏం చెప్పాడంటే?
  3. పవన్‌కి నో చెప్పింది!
  4. పవన్ సినిమా స్టోరీలైన్ ఇదే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -