Thursday, April 25, 2024
- Advertisement -

హీరో రామ్ కొత్త స్టోరీ.. వినకుండానే ఒకే చేసాడట!

- Advertisement -

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఈ ఏడాది మొదట్లో రెడ్ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ సినిమా ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే రామ్ తన తర్వాత ప్రాజెక్టును తమిళ దర్శకుడు లింగుస్వామితో చేయనున్నాడని ఇదివరకే ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగుకు కరోనా అడ్డురావడంతో వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి రామ్ ఓ విషయం గురించి అప్డేట్ ఇచ్చారు.

ఈ సందర్భంగా రామ్ ట్వీట్ చేస్తూ.. ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ డైరెక్టర్ లింగుస్వామి పూర్తి చేశారని తెలిపారు. చివరి కథనం పూర్తి అయ్యింది… ఈ కథ సూపర్ కిక్ ఇస్తోంది లవ్ యు లింగస్వామి సార్ ఇక షూటింగ్ మొదలు పెడదాం అంటూ.. తెలిపారు. ప్రస్తుతం రామ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:అమ్మాయిలను ఏడిపిస్తున్న జబర్దస్త్ టీమ్ లీడర్.. ఎవరంటే?

రామ్ ట్వీట్ , చూసిన నెటిజన్లురామ్ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే ఈ సినిమా ఓ రేంజ్ లో ఉండబోతోందని అర్థమవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వినకుండానే సినిమాకు ఓకే చెప్పడం చూస్తుంటే ఈ సినిమా ఈ విషయంలో హీరో రామ్ పెద్ద సాహసం చేస్తున్నాడని చెప్పవచ్చు. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి సనన్ నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

Also read:యాంకర్ రవిపై అషు రెడ్డి డబుల్ మీనింగ్ డైలాగులు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -