‘మా’ ఎన్నికల్లో పోటీపై కళ్యాణ్ రామ్ క్లారిటీ..!

- Advertisement -

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికల్లా తలపిస్తున్నాయి. ఏకంగా నలుగురు అభ్యర్థులు రంగంలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. మా ఎన్నికలకు ఇంతకుముందెప్పుడూ ఇంతలా పోటీ నెలకొనలేదు. మా ఎన్నికల్లో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, ఆర్టిస్ట్ హేమ పోటీ చేస్తున్నారు. అయితే వీరిలో ప్రకాష్ రాజ్ కు చిరంజీవి, జీవితా రాజశేఖర్ కు బాలకృష్ణ మద్దతు ఉందని ప్రచారం సాగుతోంది. ఇక విష్ణు కోసం ఆయన తండ్రి మోహన్ బాబు రంగంలోకి దిగి పలువురు సీనియర్ నటులను కలుస్తున్నారు.

కాగా వీరితోపాటు ఎన్టీఆర్ సోదరుడు, కళ్యాణ్ రామ్ కూడా మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై కళ్యాణ్ రామ్ స్పందించాడు. తాను పోటీ చేయడం పై క్లారిటీ ఇచ్చాడు. ‘ మా ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని, ఇది కేవలం రూమర్ మాత్రమే అని’ ఆయన కొట్టిపారేశారు. కళ్యాణ్ రామ్ క్లారిటీ తో మా ఎన్నికల్లో నలుగురు అభ్యర్థుల మధ్యే పోటీ ఉందని స్పష్టమైంది.

- Advertisement -

మా ఎన్నికలకు ఎప్పుడూ లేనివిధంగా నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండడంతో సెప్టెంబర్లో జరగాల్సిన ఎన్నికలకు ఇప్పటి నుంచే వేడి మొదలైనట్లు కనిపిస్తోంది. మూవీ ఆర్ట్స్ ఆసోసియేషన్ కు ఎన్నికలు జరిగిన ప్రతిసారి చిరంజీవి మద్దతు కీలకంగా మారుతోంది. ఆయన ఆయన ఎవరికైతే మద్దతు ఇస్తారో వారు ఎన్నికల్లో గెలవడం పలుసార్లు జరిగింది. కానీ ఈసారి చిరంజీవి ఏ ఒక్క అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ముందుగా ప్రకాశ్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఉంటుందని భావించినా అనూహ్యంగా మంచు విష్ణు రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఏ అభ్యర్థికి మద్దతివ్వాలని చిరంజీవి ఆలోచనలో పడ్డట్లు సమాచారం.

Also Read

పెళ్లంటే నరకం..! అంటున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్..!

మాస్ట్రో ఓటీటీలో? పాపం నితిన్​ ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -