Saturday, April 27, 2024
- Advertisement -

నటి రష్మికకు గుండు.. అసలు కథ ఏంటీ?

- Advertisement -

ఛలో చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన తర్వాత వచ్చిన ‘గీతాగోవిందం’ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుంచి ఈ బ్యూటీ దశ తిరిగింది. వరుసగా స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకుంటూ తెలుగు, తమిళ, కన్నడ,హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో కొనసాగుతుంది. రష్మిక బాలీవుడ్ లో రెండు చిత్రాలు చేస్తుండగా సౌత్ లో చేస్తున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇప్పటి వరకు రష్మిక చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటనతో ఊహించని రీతిలో గుర్తింపును దక్కించుకుంది. ఎప్పుడూ జుట్టుతో అందంగా కనిపించే రష్మిక గుండుతో కనిపిస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. కానీ ఇప్పుడు తమిళనాడు లో మాత్రం రష్మిక గుండు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. కొందరు తమ వ్యాపారం కోసం ఆమె గుండు ఫోటోలను ఉపయోగించుకుంటున్నారు. తమిళనాట కొన్ని సెలూన్ షాపుల ముందు రష్మిక గుండు ఫోటో దర్శనం ఇస్తుంది.

సాధారణంగా సెలూన్ల కోసం హీరోల ఫోటోలను ఉపయోగించుకోవడం ఎక్కువగా జరుగుతుంది. అలా కాకుండా తమిళనాడులో హీరోయిన్స్ ఫోటోలను గుండు కొట్టి మరీ వాళ్ళ ప్రచారానికి వాడుకుంటారు. గతంలో కీర్తి సురేష్‌, నయనతార రష్మిక ఫోటోలను ఉపయోగించుకోగా ఇప్పుడు రష్మిక ఫోటోలను వాడేసుకుంటున్నారు. రష్మిక గుండు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫోటోలు చూసి కన్నడ బ్యూటీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

తిరుమలలోనే అంజనీపుత్రుడి జననం

నితిన్ ‘మాస్ట్రో’ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్!

తెలంగాణలో కరోనా డేంజర్ వేవ్.. ఒక్కరోజే 20 మంది మృతి!

కరోనా ఎఫెక్ట్ : సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’రిలీజ్ వాయిదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -