Friday, April 26, 2024
- Advertisement -

సెలబ్రెటీ స్టేటస్ కు అసలైన అర్ధం చెప్పిన రాశీ ఖన్నా!

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో కరోనా బాధితులకు అండగా ఎంతోమంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి తమ వంతు సాయంగా బాధితులను ఆదుకున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ సేవా కార్యక్రమాలలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే నటి రాశీఖన్నా కూడా భాగమయ్యారు. గత కొన్ని రోజుల క్రితమే థాంక్యూ సినిమా షూటింగ్ ఇటలీలో జరుపుకొని తిరిగి ఇండియాకి వచ్చిన ఈమె ఇండియాకి రాగానే సేవాకార్యక్రమాలలో బిజీ అయిపోయారు.

ఈ క్రమంలోనే రాశీఖన్నా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో నలుగురికి సహాయం చేసే వారే నిజమైన సెలబ్రిటీ అంటూ తెలిపారు. ఈ విధంగా కొంత మందికి సహాయం చేసినప్పుడే సెలబ్రిటీ స్టేటస్ కు సరైన అర్థం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఎంతో మంది సెలబ్రిటీలు ఎన్నో రకాలుగా బాధితులకు సహాయం చేస్తున్నారని. వీరి ద్వారా మరెంతోమంది స్పూర్తి పొంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు.

Also read:అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో.. ఎవరంటే?

ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో ఉపాధి కోల్పోయి పూటగడవని పేదలకు ఎన్జీవోస్ సాయంతో నా వంతుగా సహాయం చేస్తూ ఎంతో మంది నిరుపేదలు, అనాధల ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నానని నటి రాశీఖన్నా తెలిపారు. ప్రస్తుతం పలు భాషలలో ఎన్నో సినిమాలను చేస్తూ ఎంత బిజీగా ఉన్న రాశీఖన్నా తెలుగులో అక్కినేని నాగచైతన్య సరసన “థాంక్యూ” సినిమాలో నటిస్తున్నారు.

Also read:ఆ ముగ్గురు స్టార్స్ తో నటించాలనుంది.. బాలీవుడ్ నటి కోరికలు మామూలుగా లేవుగా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -