Wednesday, April 24, 2024
- Advertisement -

ఉగాది కానుక‌గా ‘ఆహా’లో త‌మ‌న్నా ‘లెవన్త్ అవర్’

- Advertisement -

తెలుగువారికి అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోన్న తెలుగు ఓటీటీ ఆహా తెలుగు ప్రేక్ష‌కుల కోసం తెలుగు సంవ‌త్స‌రాది వేడుక‌ల‌ను ముందుగానే అందించ‌డానికి సిద్ధ‌మైంది. అందులో భాగంగా ఏప్రిల్ 9న ఆహాలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా తొలిసారి న‌టించిన ఒరిజిన‌ల్ ‘లెవన్త్ అవర్’ ప్ర‌సారం కానుంది.

స‌మంత‌తో సామ్‌జామ్‌, రానా ద‌గ్గుబాటితో నెం.1 యారి వంటి టాక్ షోస్‌తో, ర‌వితేజ బ్లాక్‌బ‌స్ట‌ర్ క్రాక్‌, అల్ల‌రి నరేష్ నాంది వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ఆహా ఇప్పుడు త‌మ‌న్నా‘లెవన్త్ అవర్’ ఒరిజిన‌ల్‌ను అందిస్తూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌పంచంలో త‌న‌దైన స్థానాన్ని క్రియేట్ చేసుకుంది ఆహా.

పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకోవ‌డానికి అర‌త్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింద‌నేదే ప్ర‌ధానాంశమ‌ని త‌మ‌న్నా తెలిపారు. డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళ‌వింపుగా ఈ ‘లెవన్త్ అవర్’ 8 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్‌గా రూపొందింది.

మ‌ల్టీ బిలియ‌న్ డాల‌ర్స్ కంపెనీ ఆదిత్య గ్రూప్ కంపెనీకి అర‌త్రికా రెడ్డి సీఈఓ. ఈ కంపెనీ అనుకోకుండా ఆర్థిక స‌మ‌స్యల వ‌ల‌యంలో చిక్కుకుంటుంది. ఆమె స్నేహితులే శ‌త్రువులుగా మారుతారు. ఎగ్జ‌యిట్‌మెంట్‌తో కూడిన ఈ ఈ గంద‌ర‌గోళం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి అర‌త్రికా రెడ్డి ఎలా పోరాడింది. ఆ జీవ‌న పోరాటంలో ఆమె విజ‌యం సాధించిందా? అనే ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో ‘లెవన్త్ అవర్’ రూపొందింది.

ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 9న ప్ర‌సారం కానున్న ఈ వెబ్ సిరీస్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌సార‌మైన‌ తెలుగు వెబ్ సిరీస్‌లో అతి పెద్ద వెబ్ సిరీస్‌. ఉపేంద్ర నంబూరి ర‌చించిన పుస్త‌కం 8 అవ‌ర్స్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి ఈ సిరీస్‌కు రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు ఇన్‌ట్రౌప్ బ్యాన‌ర్‌పై ఈ ఒరిజిన‌ల్ రూపొందించారు కూడా. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించారు.

ఆహాలో ఈ వారం జాంబి రెడ్డి, అర్థ శ‌తాబ్దం వంటి ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. క్లాసిక్ చిత్రాలు, ఒరిజిన‌ల్స్‌తో ఆహా అతి త‌క్కువ వ్య‌వ‌థిలోనే తెలుగు వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకుంది.

న‌టీన‌టులు:
త‌మ‌న్నా, అరుణ్ అదిత్‌, వంశీ కృష్‌ణ‌, రోషిణి ప్ర‌కాష్‌, అభిజీత్ పూండ్ల‌, శ‌త్రు, మ‌ధుసూద‌న్ రావు, జ‌య‌ప్ర‌కాష్‌, ప‌విత్రా లోకేష్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనిరుద్ బాలాజీ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
నిర్మాత‌: ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి
ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌వీణ్ స‌త్తారు
ఎడిట‌ర్‌: ధ‌ర్మేంద్ర కాక‌రాల
సినిమాటోగ్ర‌ఫీ: ముఖేష్.జి
సంగీతం: భ‌ర‌త్, సౌర‌భ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -