Saturday, April 20, 2024
- Advertisement -

ఏపీలో విజృంభిస్తున్న కరోనా కేసులు!

- Advertisement -

ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. ఆ మద్య భారీగా తగ్గిపోయాయిని అనుకుంటున్న సమయంలో మళ్లీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో కేసులు పెరిగిపోతున్నాయి. నిన్నమొన్నటివరకు రెండు వందల్లోపే కేసులు నమోదు కాగా ఇప్పుడు ఏకంగా 7వందలు దాటేశాయి. గత 24గంటల్లో 35వేల 196 శాంపిల్స్‌ను పరీక్షలు నిర్వహించగా 758మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175 కొత్త కేసులు నమోదయ్యాయి.

గుంటూరు జిల్లాలో మరో 127 మంది కరోనా బారినపడ్డారు. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు గుర్తించారు. విశాఖలో 98 కృష్ణాలో 80 అనంతపురంలో 56 తూర్పుగోదావరిలో 45 నెల్లూరులో 33 ప్రకాశంలో 30 కర్నూలులో 27 శ్రీకాకుళంలో 27. కడపలో 24 విజయనగరంలో 23 పశ్చిమగోదావరిలో 13 కరోనా కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 231 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,95,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,85,209 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా మరింత పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -